క్వీన్ కంగన రనౌత్ నటించిన `మణికర్ణిక` చిత్రీకరణ సమయంలో వివాదాల గురించి తెలిసిందే. దర్శకుడు క్రిష్ తో కంగనకు తీవ్ర వివాదాలు ఎదురయ్యాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడంతో క్రిష్ పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేయకుండానే ఆ సినిమా నుంచి వైదొలిగారు. 80 శాతం క్రిష్ తెరకెక్కించగా మిగతా 20 శాతం షూట్ చేసిన కంగన అంతా తానే దర్శకత్వం వహించానని కలరింగ్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మణికర్ణిక విజయంలో క్రిష్ భాగస్వామ్యం లేదు అన్నంతగా కంగన సెటైర్లు వేయడంపైనా ఆసక్తికర చర్చ సాగింది.
అయితే అలాంటిది కానే కాదు కానీ.. వివాదాలేవీ లేవు కానీ.. ఇప్పుడు రానా నటించిన విరాటపర్వం చిత్రానికి ఇద్దరు దర్శకులు పని చేశారన్న గుసగుస వేడెక్కిస్తోంది. రకరకాల కారణాలతో వేణు ఉడుగుల కొన్నాళ్ల పాటు చిత్రబృందానికి అందుబాటులో లేరట. ఆ సమయంలో వేరొక దర్శకుడితో విరాటపర్వం సన్నివేశాలను తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే ఒక దర్శకుడు పని చేస్తుండగానే సురేష్ సంస్థ ఇలా రెండో దర్శకుడి సహాయం తీసుకోవడం విచిత్రమైనదే. కానీ ఆ సమయంలో తప్పలేదట. డెడ్ లైన్ దగ్గరపడుతుండడంతో తెలివిగా ఆ నిర్ణయం తీసుకున్నారట. ఇక రెండో దర్శకుడి విషయంలో వేణు అనుమతి తీసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. విడుదల తేదీని ప్రకటించడంతో చిత్రబృందం వేరొక యువ దర్శకుడి సహాయం కోరి షూటింగ్ భాగాన్ని సకాలంలో పూర్తి చేశారు. సదరు యువ దర్శకుడు ఎవరు? అన్నది పేరును బహిర్గతం చేయకూడదని మేకర్స్ భావిస్తున్నారట.
ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈపాటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా మహమ్మారీ సెకండ్ వేవ్ వల్ల విడుదల కాలేదు. ప్రస్తుతం విరాటపర్వం ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతోందని కథనాలొచ్చాయి. అయితే దీనిపై సురేష్ బాబు కానీ ఎస్.ఎల్.వి సినిమాస్ నిర్మాతల నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంటుంది.
రానా దగ్గుబాటి- సాయి పల్లవి జంటగా నటించిన విరాఠపర్వం ఈ సీజన్ బెస్ట్ సినిమాగా నిలుస్తుందని రానా బలంగా నమ్ముతున్నాడట. ఇప్పటికే ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సాయిపల్లవి డ్యాన్సింగ్ వేవ్ ప్రకంపనలు రేపింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఆద్యంతం ఎమోషన్ రగిలించింది. ఈ చిత్రంలో ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- ఈశ్వరి రావు- జరీనా వహాబ్ - నివేదా పెథురాజ్ కీలక పాత్రల్లో నటించారు. సురేష్ బాబు సమర్పకులుగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఓవైపు `విరాఠపర్వం` ప్రమోషన్స్ లో పాల్గొంటూనే రానా ఇతర ప్రాజెక్టుల్ని హ్యాండిల్ చేయనున్నాడు. నిర్మాతగా భారీ సినిమాల ప్రీప్రొడక్షన్ పనులు చూస్తూనే.. సొంత బ్యానర్ లాంచ్ కి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడట. ఇక సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు వగైరా ఓటీటీ ప్లానింగుని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ట్యాలెంటెడ్ రానా కథానాయకుడిగా హిరణ్య కసిప లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం సెట్స్ కెళ్లాల్సి ఉంది. అలాగే తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బస్టర్ లో నటించిన రానా మరోసారి ఆయన దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారని కథనాలొస్తున్నాయి. ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వెలువడాల్సి ఉంటుంది.