వెర్సటైల్ స్టార్ శర్వానంద్ నటించిన తాజా చిత్రం `రణరంగం`. కళ్యాణి ప్రయదర్శన్.. కాజల్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ గురువారం(ఆగస్టు 15) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తొలిరోజు క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వినిపించింది. శర్వానంద్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్రలో .. బ్లాక్ టికెటింగ్ చేసే యువకుడిగా .. ప్రేమికుడిగా వైవిధ్యమైన నటన కనబరిచారు. కానీ నేరేషన్ పరంగా దర్శకుడు చిన్నపాటి తప్పులు చేసారని విశ్లేషణలు వెలువడ్డాయి.
తాజాగా తొలిరోజు కలెక్షన్స్ డీటెయిల్స్ వచ్చాయి. రణరంగం షేర్ వివరాలు చూస్తే...నైజాం-1.41కోట్లు.. వైజాగ్-0.51కోట్లు.. తూ.గో జిల్లా-36లక్షలు.. ప.గో జిల్లా-28లక్షలు.. కృష్ణ-23లక్షలు.. గుంటూరు 36లక్షలు.. నెల్లూరు 18లక్షలు.. సీడెడ్ 48లక్షలు కలెక్ట్ చేసింది. ఆంధ్రా నుంచి సోలోగా 1.92కోట్లు కలెక్టయ్యింది. ఆంధ్రా- నైజాం ఏరియాల నుంచి 3.81కోట్లు కలెక్ట్ చేయగా... ఇతర భారతదేశం నుంచి 42లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 4.23 కోట్లు షేర్ కలెక్ట్ చేసిందని బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతోంది.
గ్రాస్ పరంగా చూస్తే.. నైజాం-2.2కోట్లు.. ఆంధ్రా -2.7కోట్లు.. సీడెడ్ -60లక్షలుజ.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో 5.5కోట్ల గ్రాస్ కలెక్టయ్యింది. ఇతర భారతదేశం నుంచి 1.1 కోట్లు కలెక్టయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 6.6 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని రిపోర్ట్ అందింది. ఓపెనింగులు బావున్నాయి. తొలి వీకెండ్ వసూళ్లు చూడాలి. సోమవారం నాటికి అసలైన పరీక్ష మొదలు కానుంది.