బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుకు సర్వం సిద్ధమైంది. భారీ చిత్రాల దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ఓ సుదీర్ఘ ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. బ్రహ్మాస్త్ర అనే టైటిల్ పై తెరకెక్కుతున్న చిత్రంలో.. అమితాబ్ బచ్చన్.. రణబీర్ కపూర్.. ఆలియా భట్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం సర్వం సిద్ధం కాగా.. ఇజ్రాయిల్ వెళ్లిపోయిన టీం.. అక్కడి నుంచి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని.. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే.. ఇలా విడుదల అయ్యేది తొలి భాగం మాత్రమే. బ్రహ్మాస్త్ర మూవీ మూడు భాగాలుగా ఉంటుందని చెప్పాడు నిర్మాత కరణ్ జోహార్. దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నాడు. అయితే.. ఈ చిత్రానికి కథ ఏంటి అనే విషయాన్ని ఇప్పటివరకూ చెప్పలేదు. కానీ నటీనటులను ఎంపిక చేసుకుంటున్న తీరు.. ఇజ్రాయిల్ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ ప్రకారం జనాలు ఓ అంచనాకు వచ్చేశారు.
ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా నవల ఆధారంగా ఈ బ్రహ్మాస్త్రను రూపొందిస్తున్నారనే డౌట్స్ వస్తున్నాయి. అమిష్ త్రిపాఠి రాసిన మైథాలజీ నవల ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా. ఐదేళ్ల క్రితమే ఈ నవలను సినిమాగా రూపొందించే హక్కులను కొనుగోలు చేశాడు కరణ్ జోహార్. అయితే.. ఒకటికి రెండు సార్లు ప్రాజెక్టు ప్రారంభం వరకు వచ్చి ఆగిపోయింది. గతేడాది రైట్స్ ఎక్స్ పైరీ అని.. సంజయ్ లీలా భన్సాలీ కొన్నాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టుకు మోక్షం కలిగిందనే టాక్ వినిపిస్తోంది.