రణబీర్ కపూర్-అలియాభట్ ప్రేమాయణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట కొన్నేళ్లుగా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. గత ఏడాదే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇంకా ఆ గడియలు రాలేదు. ఈ ఏడాదైనా పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగు పెడతారని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఈ జంట నమస్కారం చేస్తోన్న ఓ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా గా మారింది. మరి ఈ జంట ఇలా ఎందుకు ఫోజు ఇచ్చినట్లు అంటే? అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే.
అలియాభట్ ప్రధాన పాత్రలో `గంగూబాయి కతియావాడి` విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. గంగూబాయ్ గా అలియా నటన అద్భుతంగా ఉంటుందంటూ రిలీజ్ కి ముందే ప్రశంసలందుకుంటుంది.
ఇందులో ఓ సిగ్నేచర్ ఫోజు ఒకటి ఉంది. అలియా రెండు చేతులు పైకెత్తి జోడించి అభివాదం చేస్తున్నట్లు ఉంటుంది. అదే సిగ్నేచర్ పోజుని చెలికాడు ఇలా కాపీ కొట్టి సఖి మనసును దోచుకున్నాడు. ఇప్పుడా రెండు ఫోజుల్ని పక్కపక్కనే పెట్టి ఫ్యాన్ క్లబ్ లో షేర్ చేసింది అలియా. రణబీర్ ని ఇలా చూసి ప్రియురాలు అలియా తెగ మురిసిపోయింది. `ఎవరు బెస్ట్ బోయ్ ఫ్రెండ్?` అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
`గంగూబాయి కతియావాడి` సినిమాపై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్స్ లోనూ ప్రదర్శితం కానుంది. ముంబైలోని కామాటిపురలోని వ్యభిచార గృహానికి చెందిన మేడమ్ గంగూబాయ్ కథియావాడీ జీవితం నుంచి ప్రేరణ పొందిన కథ ఇది.
హుస్సేన్ జైదీ పుస్తకం `మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై` ఆధారంగా ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్నాలీ తెరకెక్కించారు. ఇందులో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటించారు. ఎవరు.. బెస్ట్ ఫ్రెండ్? అని ప్రశ్నించగానే ఆలియా పాత స్నేహితుల గురించి అభిమానులు చర్చిస్తున్నారు. రణబీర్ తో ప్రేమలో పడక ముందే సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆలియా డీప్ గా ప్రేమలో మునిగింది. కానీ అది బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.