పెళ్ళి దిశగా అలియా అడుగులు..!

Update: 2018-12-17 08:53 GMT
బాలీవుడ్ హీరో హీరోయిన్ లు రణబీర్ కపూర్.. అలియా భట్ ఇద్దరూ డీప్ గా లవ్ లో ఉన్నారని.. ఒకరిని విడిచి ఒకరు ఉండడం లేదని ఈమధ్య మీడియాలో కథనాలు వస్తున్నాయి. వారేమీ ఈ విషయాన్ని ఖండించడం లేదు.  అలా అని కలిసి తిరగడం ఏమాత్రం ఆపడం లేదు. దీంతో త్వరలోనే ఇద్దరూ పెళ్ళిపీటలు ఎక్కడం ఖాయమని కూడా కొందరు అంటున్నారు

రణబీర్-అలియా లు నెమ్మదిగా పెళ్ళిదిశగా అడుగులు వేస్తున్నారని బాలీవుడ్ లో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. దీనికి వారు ఒక కారణం కూడా చూపిస్తున్నారు.  రణబీర్ ఈమధ్య కపూర్ ఫ్యామిలీ చాట్ గ్రూప్ లో అలియా నంబర్ ను కూడా యాడ్ చేశాడట.  ఈ గ్రూప్ లో రణబీర్ అమ్మా నాన్నా రిషి కపూర్.. నీతూ కపూర్లతో పాటు రణబీర్ సోదరి రిద్ధిమా.. ఆంటీ రీమా జైన్ లాంటి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు.  అలియా రణబీర్ జంటకు త్వరలో పెళ్ళి చేసుకొనే ఆలోచన లేకపోతే ఈ ఫ్యామిలీ గ్రూప్ లో అలియా ను యాడ్ చెయ్యరు కదా?

దీపిక-రణవీర్ సింగ్ .. ప్రియాంక-నిక్ జోనాస్ లు ఈమధ్యే చేసుకున్నారు. తాజా డెవలప్ మెంట్స్ చూస్తుంటే వచ్చే ఏడాదిలో మరో స్టార్ వెడ్డింగ్ లైన్ లో ఉన్నట్టుంది.  ఇదిలా ఉంటే రణబీర్ ట్రాక్ రికార్డ్ గురించి తెలిసిన వారు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  దీపిక.. కత్రినా.. ఇలా రణబీర్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్టు చాలా పెద్దదే ఉందని అప్పట్లో కూడా ఇలానే జరిగిందని అలియా మెడలో మూడు ముళ్ళువేసేంత వరకూ రణబీర్ ను నమ్మలేమంటున్నారు.
Tags:    

Similar News