కింగ్ ఖాన్ వైఫ్.. ఆ విషయంలో క్వీన్

Update: 2016-12-15 19:30 GMT
షారూక్ ఖాన్ భార్యగా.. నిర్మాతగా గౌరీ ఖాన్ పేరు అందరికీ పరిచితమే. అంతే కాకుండా.. ఈమె ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ ఉంటుంది. కానీ స్టార్ వైఫ్స్ ఇలాంటి ప్రొఫెషన్స్ ను కేవలం హాబీగా నిర్వహిస్తుంటారని.. తాము ఏదో ఒకటి చేస్తున్నామని చెప్పుకునేందుకు చేస్తూ ఉంటారనే టాక్ ఉంది. ఎక్కువమంది ఇలాంటి వాళ్లు ఉన్నా.. కొందరు మాత్రం ఇలాంటి విషయాల్లో బాగా ప్రొఫెషనల్ గానే ఉంటారు.

ఇంటీరయర్ డిజైనింగ్ లో షారూక్ వైఫ్ చాలా ఇంటెన్సిటీతో వర్క్ చేస్తుందనే టాక్ ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆమె టేకప్ చేసే ప్రాజెక్టులు కూడా ఉంటాయి. రీసెంట్ గా రణబీర్ కపూర్ కొత్తింటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ ను గౌరీ ఖాన్ హ్యాండిల్ చేసింది. రణబీర్ టేస్ట్ కి తగినట్లుగాను.. దానికి తనదైన టచ్ ఇస్తూ ఇంటీరియర్ డెకరేటింగ్ చేసినందుకు.. గౌరీ ఖాన్ ఛార్జ్ చేసిన మొత్తం ఎంతో తెలుసా.. 35 కోట్ల రూపాయలు.

ఇంత మొత్తాన్ని చెల్లించేసి పనులు కూడా పూర్తి చేయించేసుకున్నాడు రణబీర్. వర్క్స్ పూర్తయ్యాక గౌరీ ఖాన్ ట్యాలెంట్ చూసి తెగ మురిసిపోయాడట. కేవలం స్టార్ వైఫ్ యాంగిల్ లోనే కాకుండా.. సొంత ట్యాలెంట్ తో ఇంత ఖరీదైన ప్రాజెక్టును హ్యాండిల్ చేయగలిగిందంటే.. గౌరీ ఖాన్ ట్యాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతోంది కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News