ఆ హీరోనే తనలో ధైర్యం నింపాడు అంటున్న అలియా భట్

Update: 2019-10-16 01:30 GMT
నిర్మాత - డైరెక్టర్ అయిన మహేష్ భట్ కూతురిగా బాలీవుడ్ హీరోయిన్ గా చిన్న వయస్సులోనే ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది అలియా భట్. ఇప్పుడు బాలీవుడ్ లో విజయాలు - పరాజయాలు పక్కన పెట్టి కెరీర్ లో గ్యాప్ లేకుండా దూసుకుపోతుంది. తన సహ నటుడు స్టార్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ప్రేమ లోకంలో విహరిస్తుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రణవీర్ కపూర్ ని ఆకాశానికి ఎత్తేసింది.

ఈ మధ్య ఆమె నటించిన 'కళాంక్' మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. 100 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 80 కోట్ల రేంజ్ లోనే ఆగిపోవడంతో తాను డిఫ్రెషన్ లోకి వెళ్ళిపోయాను అని చెప్పింది. ఎంతో కష్టపడి నటించిన సినిమా అలా ప్లాప్ కావడంతో తాను చాలా బాధ పడ్డానని, అప్పుడు రణబీర్ కపూర్ చెప్పిన మాటలు తనకు ఉత్తేజాన్నిచ్చాయని ఆమె చెప్పుకొచ్చింది. నువ్వు నీ శక్తి మేరకు కష్టపడి నటించావని, నీ శ్రమ వృధా కాదని, దాని ఫలితం ముందు ముందు చూస్తావని రణబీర్ చెప్పిన మాటలు తనలో ప్రేరణ కలిగించాయని ఆమె చెప్పింది. ఇదిలా ఉంటే త్వరలోనే వీళ్లిద్దరికీ పెళ్లి జరగబోతుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Tags:    

Similar News