బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్ లకు కొదవలేదు.. అలా ప్రేమిస్తారు.. ఇలా విడిపోతారు.. ఒకరి గర్ల్ ఫ్రెండ్.. మరొకరి గర్ల్ ఫ్రెండ్ గా మారిపోతోంది. పోయిన సంవత్సరం ఓ హీరోతో ఎఫైర్ కొనసాగించిన హీరోయిన్ ఇప్పుడు వేరే టాప్ హీరోతో తిరుగుతుంటుంది. సినిమాల్లో మొదలైన పరిచయాన్ని డేటింగ్ వరకూ తీసుకెళ్లి అనంతరం బ్రేకప్ వరకూ తీసుకెళుతున్నారు..
బాలీవుడ్ లో ప్లేబాయ్ గా పేరు సంపాదించిన హఈరో రణబీర్ కపూర్ ఎఫైర్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. తొలుత దీపికా పదుకొనే - తర్వాత కత్రినా కైఫ్ తో ఎఫైర్లు నడిపాడు. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు ఆలియాకు దగ్గరయ్యాడన్నది బాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. ఆలియా-రణబీర్ బంధానికి రెండు కుటుంబాలు కూడా ఓకే అన్నాయని వార్తలు వచ్చాయి.
తాజాగా వీరి బంధంపై రణబీర్ తంద్రి రిషికపూర్ స్పందించాడు. మిడ్ డే అనే ఆంగ్ల ప్రతికతో మాట్లాడారు. తన కొడుకు రణబీర్ పెళ్లి పీటలు ఎక్కాలన్నది తన కోరిక అని.. ఎవరిని చేసుకున్నా తనకు మనవలు, మనమరాళ్లతో కలిసి ఆడుకోవాలన్నదే కోరిక అని తెలిపాడు. ఆలియా-రణబీర్ మధ్య ఏముందో.. ప్రతి ఒక్కరికి తెలుసు.. తానింకేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని రిషికపూర్ స్పష్టం చేశారు.
ఇలా ప్రేమలు - బ్రేకప్ లతో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను మార్చిన రణబీర్.. తాజాగా ఆలియా భట్ తోనైనా ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళ్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే..