పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ చేయని ప్రయత్నం లేదు. వరుసగా అతడు భారీతనం నిండిన చిత్రాలతో సంచలనాల కోసం వేచి ఉన్నాడు. ఖాన్ ల తర్వాత తన స్థానంపై గట్టి పట్టు పడుతున్నాడు. సౌత్ నుంచి డామినేట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్లను ఈక్వల్ చేయాలని రణబీర్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంకా చెప్పాలంటే సౌత్ స్టార్ల తర్వాత తానే పాన్ ఇండియా స్టార్ డమ్ ని కలిగి ఉన్నానని నిరూపించేందుకు ఇతరుల కంటే ముందే ఒక మెట్టు దిగొచ్చాడు. ఈగోలకు తావివ్వకుండా సౌత్ లోనూ ప్రచారానికి దిగుతున్నాడు. వైజాగ్ - రాజమండ్రి లాంటి చోట్లా ప్రచారంతో తన ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
బ్లాక్ బస్టర్ `సంజు` తర్వాత రణబీర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షంషేరా ట్రైలర్ ఇప్పటికే దూసుకెళ్లింది. ప్రతీకారం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రి శంషేరా పాత్రలో అలానే కొడుకు బల్లిగా రణబీర్ నటిస్తున్న విషయాన్ని ట్రైలర్ ఆవిష్కరించింది. రణబీర్ ఒకే చిత్రంలో రెండు పాత్రలు పోషించడం ఇదే మొదటిసారి. రణబీర్ ఒక ఈ చిత్ర ప్రచార వీడియోలో తనపై తానే సెటైర్లు వేసుకోవడానికి వెనకాడకపోవడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది.
`ది అదర్ కపూర్ షో` అభిమానులను ఎగ్జయిట్ చేయనుంది. శంషేరా కథ కల్పిత నగరమైన కాజాలో జరుగుతుంది. ఒక యోధ వర్గాన్ని ఖైదు చేసి అధికార జనరల్ షుద్ సింగ్ బానిసల కంటే ఘోరంగా హింసిస్తాడు. అక్కడ బానిస నాయకుడిగా ఎదిగే ఒక యువకుడి కథ ఇది. అతను తన వాళ్ళ స్వేచ్ఛ గౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాడుతాడు. అతని పేరు శంషేరా.
హై-ఆక్టేన్ అడ్రినలిన్-పంపింగ్ ఎంటర్ టైనర్ గా 800ల ప్రాంతంలో భారతదేశంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని దీన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో శంషేరా పాత్రలో నటించిన రణబీర్ కపూర్ గతంలో ఎన్నడూ చేయని పాత్రను ఇందులో చేశారు. తిరుగుబాటు ఉద్యమ నేపథ్యంలోని ఈ చిత్రంలో రణబీర్ కు బద్ధ శత్రువుగా సంజయ్ దత్ నటించారు. అగ్నిపథ్ తరహా క్రూరుడిగా దత్ మరోసారి ఇందులో నటించారు.
ఈ యాక్షన్ ఎంటర్ టెయినర్ ను ఆదిత్య చోప్రా నిర్మించారు. 2022 జూలై 22న హిందీ- తమిళం - తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇతర దక్షిణాది భాషలలోనూ విడుదల చేసేందుకు రణబీర్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.