అవును.. ప్రముఖ దర్శకుడు ఒక యువహీరోని కొట్టేవాడు. మోకాళ్లపై కూచోబెట్టేవాడు.. చెప్పింది చెప్పినట్టు చేయకపోతే పనిష్ మెంట్ తీవ్రంగా ఉండేది. దానిని తట్టుకోలేక సెట్ నుంచి పారిపోదామనుకుని చివరికి తనని తాను సర్ధి చెప్పుకునేవాడట ఆ హీరో.
ఇంతకీ ఈ అనుభవం ఎవరిది? అంతటి కఠినాత్ముడైన ఆ దర్శకుడు ఎవరు? అంటే.. బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ అతడి గురువుగారు సంజయ్ లీలా భన్సాలీ గురించే ఇదంతా. సావారియా చిత్రంతో రణబీర్ ని తెరకు పరిచయం చేసింది సంజయ్ లీలా భాన్సాలీ. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఇందులో నటించిన రణబీర్ కి చక్కని గుర్తింపు దక్కినా కానీ బాక్సాఫీస్ ఫలితం నిరాశపరిచింది.
ప్రస్తుతం శంషేరా- బ్రహ్మాస్త్ర చిత్రాల ప్రచారంలో బిజీగా ఉన్న రణబీర్ తాజాగా తన గురువుగారితో తొలి రోజుల్లో అనుభవాలను పంచుకుంటూ భన్సాలీ తనని కొట్టేవాడని మోకాళ్లపై కూచోబెట్టేవాడని కూడా తెలిపాడు. ఆ టార్చర్ భరించలేక సెట్ ని వదిలిపెడదామని నిర్ణయించుకున్నాను.
కానీ నాకు నేను సర్ది చెప్పుకున్నాను. సావారియా చిత్రాన్ని మధ్యలో వదిలివేయకూడదనుకున్నాను. ఆ సమయంలోనే నేను ఎమోషనల్.. సెన్సిటివ్ అని నాకు అర్థమయింది అని రణబీర్ చెప్పాడు.
భన్సాలీ దర్శకత్వం వహించిన బ్లాక్ సినిమాకు కూడా రణబీర్ కపూర్ సహాయదర్శకుడిగా పని చేసారు. శంషేరా చిత్రంతో పాన్ ఇండియా హిట్టు కొట్టాలని కసిగా ప్రమోషన్ చేస్తున్న రణబీర్ ఇటు దక్షిణాది పైనా పూర్తిగా దృష్టి సారించాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తిరిగి బ్రహాస్త్రను కూడా మరో లెవల్లో ప్రమోట్ చేయనున్నాడట.