సౌత్ రాష్ట్రాలని చుట్టేసే ప్లాన్ తో దిగిన ర‌ణ‌బీర్!

Update: 2022-08-24 13:30 GMT
ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ జంట‌గా ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌' బ్ర‌హ్మాస్ర' మొద‌టి భాగం రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సౌత్ భాష‌ల‌న్నింటికి ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఇక్క‌డా బ‌జ్ బాగానే క్రియేట్ అవుతుంది.

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే  ముంబై స‌హా హైద‌రాబాద్ లో యూనిట్ జోరుగా ప్రచారం  నిర్వ‌హించింది.  ప్ర‌చారంలో భాగంగా రాజ‌మౌళి..చిరంజీవి లాంటి దిగ్గ‌జాల్ని  సైతం రంగంలోకి దించారు. తాజాగా యూనిట్ చెన్నైలో ప్ర‌చార ప‌నుల్లో బిజీగా ఉన్న‌ట్లు  తెలిసింది. నేటి ప్ర‌చారానికి ర‌ణ‌బీర్ తో పాటు రాజ‌మౌళి..నాగార్జున కూడా  హాజ‌ర‌య్యారు.

ముగ్గురికి అక్క‌డ ఘ‌న‌మైన స్వాగ‌తం ల‌భించింది. భాజాలు..డోలు వాయిస్తూ చెన్నై ఈవెంట్కి నిర్వాహ‌కులు ఆహ్వానించారు. ర‌ణబీర్ కపూర్ సాధారణ లుక్‌లో క‌నిపించారు.  వైట్  టీ ష‌ర్ట్ పై నలుపు చొక్కా - ప్యాంటులో క‌నిపించారు. ఇక రాజ‌మౌళి సాధార‌ణ ప్యాంట్..ష‌ర్టు లో క‌నిపించ‌గా...నాగ్ సైతం అంతే సింపుల్  కంప‌ర్ట్ దుస్తుల్లో ద‌ర్శ‌నమిచ్చారు.  

చెన్నై ఈవెంట్ ని ముగించుక‌ని మ‌ల‌యాళం..క‌న్న‌డ భాష‌ల ప్ర‌చారానికి కూడా హాజ‌ర‌య్యే అవకాశం ఉంది. అక్క‌డా పెద్ద ఎత్తెన రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి ప్ర‌చారం త‌ప్ప‌దు. ఈ వారం రోజులు సౌత్ లోనే ఎక్కువ‌గా ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. అటుపై నాలుగైదు రోజులు హిందీ ప్ర‌చారానికి స‌మ‌యం కేటాయిస్తారు. ఇటీవ‌ల 'లైగ‌ర్' సినిమా ప్ర‌చారాన్ని ఇదే త‌రహాలో నిర్వ‌హించారు.

ముందుగా హిందీ లో పెద్ద ఎత్త‌న ప్ర‌చారం  చేసారు. దీనిలో భాగంగా వివిధ సిటీలు యూనిట్ చుట్టేసింది. రిలీజ్ ద‌గ్గర‌కు వ‌చ్చేసిరికి తెలుగు రాష్ర్టాల్లో ప్ర‌మోట్  చేసారు. బ్ర‌హ్మ‌స్ర్త టీమ్ అదే స్ర్టాట‌జీతో ముందుకెళ్తుంది.

ఈ సినిమాతో నాగార్జున  కొన్నేళ్ల తర్వాత హిందీ లో కం బ్యాక్ అయ్యారు.  ఇందులో ఆయ‌న‌ పురావస్తు శాస్త్రజ్ఞుడి పాత్రలో కనిపిస్తారు. తెర‌పై క‌నిపించినంత సేపు ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని అంచ‌నాలున్నాయి. మ‌రి కింగ్ రోల్  ఎలివేష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.  ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్.. ధర్మ ప్రొడక్షన్స్.. ప్రైమ్ ఫోకస్.. స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Tags:    

Similar News