టాక్ ఐతే వచ్చింది.. మరీ కలెక్షన్స్ ఏవి..??

Update: 2021-03-31 08:30 GMT
ఇండస్ట్రీలో సినిమాలు విడుదలైన వెంటనే అది ఎంతవరకు వసూల్ చేయగలుగుతుంది అనేది చెప్పలేం. కానీ ఎంత వసూల్ చేస్తే హిట్ అవుతుంది అనేది మాత్రం చెప్పగలరు. అయితే కొన్నిసార్లు సినిమా ట్రైలర్ అదిరిపోయినా సినిమాలో ఏదైనా లోటు కనిపిస్తే మాత్రం వసూళ్లు రాబట్టడం కష్టమే. అలాగని ట్రైలర్ బాలేకపొతే సినిమాలు ఆడవనే రూల్ కూడా లేదు. సినిమా విడుదలయ్యాక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఎవరు ఆపలేరు. జనాలు వద్దన్నా పరిగెత్తుకుంటూ వస్తారు. మొదట్లో ఎంత జోరు చూపించినా తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టే అవకాశం అన్ని సినిమాలకు ఉంటుంది. ప్రస్తుతం అదేబాటలో వెళ్తోంది.. హీరో నితిన్ నటించిన 'రంగ్ దే' మూవీ. ఈ సినిమాపై జనాల్లో భారీగా కాకుండా మోస్తరు అంచనాలే ఉండేవి.

ట్రైలర్ చూడగానే రొటీన్ లవ్ స్టోరీ అనే టాక్ వినిపించింది. ఓవైపు అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాలు కూడా మంచి హైప్ క్రియేట్ చేసుకున్నాయి. కానీ తీరా రిలీజ్ అయ్యాక 'రంగ్ దే' మూవీనే పాజిటివ్ టాక్ సాధించి మంచి వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి రంగ్ దే మూవీ.. టైంపాస్ మూవీ అయినా అరణ్య, తెల్లవారితే సినిమాలను వెనక్కి నెట్టేసి ఈ వారం విజేతగా నిలిచిందని చెప్పవచ్చు. కానీ ఏ సినిమాకైనా టైం ఎప్పటికి ఫేవర్ గా ఉండదుగా.. అనుకున్నట్లుగా అన్ని సినిమాలలాగే ఈ సినిమాకు కూడా కలెక్షన్స్ తగ్గాయి. స్టార్టింగ్ లో హోలీ హాలిడే రావడంతో 12.5 కోట్లవరకు ఈజీగా రాబట్టింది. కానీ మంగళవారం నుండి కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు సమాచారం. మరి ఈ లెక్కన సినిమా హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈవెన్ మినిమం 20కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు రంగ్ దేకు జనాలు వచ్చే అవకాశం తక్కువ. చూడాలి మరి నితిన్ రంగ్ దే.. కమర్షియల్ హిట్ అవుతుందేమో!
Tags:    

Similar News