తగ్గుముఖం పడుతున్న 'రంగ్ దే' కలెక్షన్స్.. ఇప్పటివరకు ఎంతంటే??

Update: 2021-04-02 09:50 GMT
గతేడాది భీష్మా సినిమా తరువాత టాలీవుడ్ హీరో నితిన్ నుండి చెక్ మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆ సినిమా నితిన్ ఆశలను, ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది. కానీ చెక్ సినిమా వచ్చిన నెల రోజులకే మరో సినిమాను రెడీ చేసాడు. ఆ సినిమానే 'రంగ్ దే'. గతవారం విడుదలైన రంగ్ దే మూవీ.. ఫస్ట్ మూడు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టింది. కానీ చివరిగా ఏ సినిమా అయినా రోజులు పెరిగినకొద్దీ కలెక్షన్స్ తగ్గడం మాములే అనే సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రంగ్ దే కలెక్షన్స్ షాక్ ఇస్తున్నాయి. సరిగ్గా వారం రోజుల తర్వాత రంగ్ దే కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నిజానికి రంగ్ దే మూవీ అన్ని ఏరియాల్లో కలిపి 21.20కోట్ల బిజినెస్ సెట్ చేసింది. నైజాంలో 7.60కోట్లు, సీడెడ్ లో 3.6కోట్లు, ఆంధ్రాలో 10కోట్లు బిజినెస్ జరిగిందట. మిగతా రాష్ట్రాలలో, యూఎస్ కలిపి టోటల్ గా 'రంగ్ దే' మూవీ 23.90కోట్లు టార్గెట్ సెట్ చేసుకుంది. ఐతే మొదట్లో నాలుగు, మూడు, రెండుకోట్లు వసూల్ చేసిన సినిమా.. ఇప్పుడు 7వ రోజు చూస్తే వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. నైజాంలో 18లక్షలు, సీడెడ్‌లో 6లక్షలు, ఉత్తరాంధ్రలో 4లక్షలు, ఈస్ట్‌లో 2లక్షలు, వెస్ట్‌లో 1.20 లక్షలు, గుంటూరులో 2లక్షలు, కృష్ణాలో 3.40 లక్షలు, నెల్లూరులో 1 లక్షతో తెలుగు రాష్ట్రాల్లో గురువారం 38 లక్షలు షేర్, 60లక్షలు గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొత్తంగా ఇప్పటివరకు రంగ్ దే మూవీ.. 15.58కోట్లు షేర్ వసూల్ చేసిందని టాక్. మరి ఆల్రెడీ వేరే సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి. రంగ్ దే కలెక్షన్స్ చెప్పలేని పరిస్థితి ఫేస్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. చూడాలి మరి టార్గెట్ రీచ్ అవుతుందేమో!
Tags:    

Similar News