చిత్రం : 'రంగ్ దే'
నటీనటులు: నితిన్ - కీర్తి సురేష్ - నరేష్ - కౌసల్య - రోషిణి - వెన్నెల కిషోర్ - అభినవ్ గోమటం - బ్రహ్మాజీ - సుహాస్ - వినీత్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి
ఈ మధ్య కాలంలో కలర్ ఫుల్ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన సినిమా ‘రంగ్ దే’. నితిన్-కీర్తి సురేష్ జంటగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన ఈ సినిమా.. ఒక అందమైన ప్రేమకథను చూడబోతున్న భావన కలిగించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగ్ దె’ వెండితెరను ఏ మేర రంగుల మయం చేసిందో చూద్దాం పదండి.
కథ:
అర్జున్ (నితిన్).. అను (కీర్తి సురేష్) చిన్నతనం నుంచి పక్క పక్క ఇళ్లలో పెరిగి అబ్బాయి-అమ్మాయి. చదువు దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఎప్పుడూ తనను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే అను అంటే అర్జున్ కు అసలేమాత్రం ఇష్టం ఉండదు. కానీ అనుకు మాత్రం అర్జున్ అంటే ఇష్టం. అను నచ్చపోయినా అర్జున్ అనివార్య పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పెళ్లయ్యాక అను మరింతగా అర్జున్ ను ఇబ్బంది పెట్టడం మొదలవుతుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలై దూరం పెరుగుతుంది. ఇంతకీ అర్జున్ తో అను అలా ఎందుకు ప్రవర్తిస్తుంది.. వీరి మధ్య సఖ్యత ఏర్పడిందా.. వీరి బంధం నిలబడిందా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ అబ్బాయికి ఆ అమ్మాయంటే ఇష్టం ఉండదు. అయిష్టంగానే ఆ అమ్మాయితో కలిసి జీవించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ క్రమంలో ఓ సంఘర్షణ. చివరికి ఆ అమ్మాయి గొప్పదనం తెలుసుకుని అబ్బాయి దగ్గరవుతాడు. ఈ ఫార్మాట్లో తెలుగులోనే కాదు.. వివిధ భాషల్లో వచ్చిన సినిమాలు కోకొల్లలు. ఐతే ప్రేమకథలంటేనే ఇలాంటి రిపిటీషన్ మామూలే కాబట్టి.. కథ గురించి పెద్దగా పట్టించుకోరు ప్రేక్షకులు. కథ రొటీన్ అయినా.. దాన్ని ఎంగేజింగ్ గా చెబితే.. ప్రేక్షకుల్లో ఫీల్ తేగలిగితే.. వినోదం వర్కవుట్ అయితే.. కొంచెం భావోద్వేగాలను కూడా పండించగలితే బాక్సాఫీస్ పరీక్షలో పాసైపోవచ్చు. ‘రంగ్ దె’ టీం సరిగ్గా అదే చేసింది. కథాకథనాల పరంగా రొటీన్ అనిపించినా.. ప్రేక్షకులకు బోర్ కొట్టించని సన్నివేశాలు.. చక్కటి లీడ్ పెయిర్.. వారి మధ్య పండిన కెమిస్ట్రీ.. దీనికి తోడు సాంకేతిక హంగులన్నీ చక్కగా అమరడంతో ఇందులో టైంపాస్ వినోదానికి ఢోకా లేకపోయింది. ఇంతకుమించి ప్రత్యేకంగా ఏదైనా ఆశిస్తే మాత్రం ‘రంగ్ దే’ నిరాశ పరుస్తుంది.
‘రంగ్ దే’ ప్రోమోలు చూస్తేనే ఇది లీడ్ పెయిర్ కెమిస్ట్రీ మీద నడిచే సినిమా అని అర్థమైపోయింది. నితిన్-కీర్తి సురేష్ రూపంలో అందమైన.. యూత్ ఈజీగా రిలేట్ చేసుకునే జంట ఉండటం ‘రంగ్ దే’కు ప్లస్ అయింది. తెర మీద వీళ్లిద్దరి కెమిస్ట్రీ చక్కగా పండటం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ప్రథమార్ధం అంతా ప్రధానంగా వీళ్లిద్దరి గిల్లి కజ్జాలకు తోడు.. కొన్ని కామెడీ క్యారెక్టర్ల ద్వారా మంచి వినోదం పండటంతో ‘రంగ్ దే’ బండి రయ్యిన సాగిపోతుంది. పాత్రలతో సహా సెటప్ అంతా రొటీన్ గానే అనిపించినా.. ఆహ్లాదకరమైన సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టి పక్కదారి పడకుండా చూస్తాయి. ముఖ్యంగా బ్రహ్మాజీ.. వెన్నెల కిషోర్ పాత్రలతో ముడిపడ్డ కామెడీ సన్నివేశాలు ప్రథమార్ధాన్ని పాస్ చేసేశాయి. ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా వినోద ప్రధానంగా సాగడం కలిసొచ్చింది. ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా సింపుల్ గా సన్నివేశాలు సాగిపోయేలా చూసుకున్నాడు దర్శకుడు వెంకీ. తక్కువ నిడివిలో ప్రథమార్ధం ముగిసిపోవడంతో ప్రేక్షకులకు సమయం గడిచినట్లే తెలియదు. ఒక చిన్న ట్విస్టుతో ప్రథమార్ధాన్ని ముగించాడు దర్శకుడు.
‘రంగ్ దే’ ద్వితీయార్ధం ఎక్కువగా ఎమోషన్ల మీదే నడుస్తుంది. ఐతే అవి ప్రేక్షకుల్లో కదలిక తెచ్చే స్థాయిలో లేకపోయాయి. హీరో హీరోయిన్ల మధ్య ఘర్షణ తర్వాత.. సినిమా చివరి వరకు ఏం జరుగుతుందనే విషయంలో ప్రేక్షకుడికి ఒక అంచనా వచ్చేస్తుంది. ఆ అంచనాలను దాటి ‘రంగ్ దే’ పక్కకు వెళ్లకపోవడం నిరాశ పరుస్తుంది. కథ దుబాయికి షిఫ్ట్ అయ్యాక అంతా సినిమా ఒక ఫార్మాట్లో సాగిపోతుంది. వెన్నెల కిషోర్ మళ్లీ కొంచెం సాయం పట్టినా ద్వితీయార్ధంలో ఎంటర్టైన్మెంట్ డోస్ తగ్గిపోయాయి. హీరో హీరోయిన్ల మధ్య గొడవ.. అలకలు.. సంఘర్షణ.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి. బలమైన సన్నివేశాలు పడకపోవడం వల్ల ఎమోషన్లు లైట్ అనిపిస్తాయి. కాకపోతే మరీ విసిగించే సీన్లయితే లేవు ద్వితీయార్ధంలో. తక్కువ నిడివితో సినిమాను ముగించేయడం.. లైట్ హార్టెడ్ సన్నివేశంతో సినిమాను ముగించడంతో ‘ఓకే’ అనిపిస్తుంది. సినిమా కొంచెం డౌన్ అయినపుడల్లా మంచి పాట పడటం.. పీసీ శ్రీరామ్ ఆద్యంతం విజువల్ గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వడం వల్ల కూడా ‘రంగ్ దే’ నిలబడగలిగింది. వినోదం.. ఎమోషన్ల పరంగా ఎక్కువ ఆశించకుండా రెండు గంటలు టైంపాస్ చేద్దామనుకుంటే ‘రంగ్ దే’ మంచి ఛాయిసే.
నటీనటులు:
నితిన్ అర్జున్ పాత్రను చాలా ఈజీగా చేసుకుపోయాడు. ఆ పాత్రకు యాప్ట్ అనిపించాడు. యూత్ కు నచ్చేలా ట్రెండీగా కనిపించాడు. నటన కూడా స్టైలిష్ గానే సాగింది. నటన పరంగా అతణ్ని కీర్తి సురేష్ డామినేట్ చేసింది. సినిమాలో అందరిలోకి పెర్ఫామెన్స్ పరంగా ఆమెకే ఎక్కువ మార్కులు పడతాయి. ద్వితీయార్ధంలో కీర్తి ప్రత్యేకతను చాటే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. లుక్ పరంగా మాత్రం కీర్తి కొంత నిరాశ పరుస్తుంది. మరీ బక్కచిక్కిపోవడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మిగతా నటీనటుల్లో నరేష్ కు కీలకమైన పాత్ర దక్కింది. ఆయన కొన్ని సన్నివేశాల్లో బాగా నవ్వించారు. అవసరమైనపుడు సీరియస్ గానూ నటించి మెప్పించారు. వెన్నెల కిషోర్ అడవి శాస్త్రి పాత్రలో నవ్వులు పంచాడు. హీరో ఫ్రెండు పాత్రల్లో అభినవ్ గోమటం, సుహాస్ కొన్ని చమక్కులతో ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ కనిపించినంతసేపూ నవ్వించాడు. రోహిణి మరోసారి తన హుందా నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ తల్లి పాత్రకు ఆమెను మించిన ఛాయిస్ కనిపించదు.
సాంకేతిక వర్గం:
‘రంగ్ దే’కు సాంకేతిక హంగులు ప్రధాన ఆకర్షణ. సంగీతం, ఛాయాగ్రహణం కోసమే సినిమా చూడొచ్చు అనిపించేలా దేవిశ్రీ ప్రసాద్, పీసీ శ్రీరామ్ తమ పనితనాన్ని చూపించారు. చాన్నాళ్ల తర్వాత ప్రేమకథకు సంగీతం అందించే అవకాశం రావడంతో దేవిశ్రీ ప్రసాద్ తన ప్రత్యేకతను చాటే ప్రయత్నం చేశాడు. రంగులే.. ఏమిటో ఇది పాటలు మెలోడియస్ గా సాగి ప్రేక్షకులను మెప్పిస్తాయి. బస్టాండే బస్టాండే.. చూసి నేర్చుకోకు పాటలు సరదాగా సాగి ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతంతోనూ దేవిశ్రీ ప్రసాద్ అలరించాడు. ఇక పీసీ శ్రీరామ్ విజువల్స్ ప్రతి సన్నివేశంలోనూ కళ్లు మిరుమిట్లు గొలిపేలా చేస్తాయి. హీరో హీరోయిన్లను.. పరిసరాలను ఆయన చూపించిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. సినిమా ఆద్యంతం కలర్ ఫుల్ గా ఉండేలా చూసుకున్నాడాయన. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆయన పనితనం ఎలివేట్ కావడానికి దోహదపడింది. నిర్మాణ విలువలు సితార ఎంటర్టైన్మెంట్స్ స్థాయికి తగ్గట్లే రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి ఒక మామూలు ప్రేమకథను అందమైన ప్యాకేజీలా అందించే ప్రయత్నం చేశాడు. అతడి కథలో పెద్ద మలుపులేమీ లేవు. కథనంలోనూ పెద్దగా మెరుపులు కనిపించవు కానీ.. ఆహ్లాదకరమైన నరేషన్ తో మెప్పించాడు. సింపుల్ సన్నివేశాలతోనే వినోదం పండించడంలో అతను విజయవంతమయ్యాడు. భావోద్వేగాలు పండించడంలో పర్వాలేదనిపించాడు. దర్శకుడిగా అతడికి పాస్ మార్కులు పడతాయి.
చివరగా: కలర్ ఫుల్లూ కాదు..డల్లూ కాదు..!
రేటింగ్-2.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre