రంగస్థల నటీనటు జీవితాల ఆధారంగా తెకెక్కిన మరాఠీ మూవీ 'నట సామ్రాట్'. విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ రూపొందించిన ఈ మూవీ 2016లో అక్కడ విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే సినిమాని తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ 'రంగమార్తాండ' పేరనుతో రీమేక్ చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇతర పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ, అలీ రెజా నటిస్తున్నారు. గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీ ప్రకటించి.. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరి నుంచి ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులు, కృష్ణవంశీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మన తల్లిదండ్రుల కథ అంటూ కృష్ణవంశీ ప్రచారం చేస్తున్న ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. మెగాస్టార్ ఈ సినిమా కోసం చెప్పిన షాయరీ బుధవారం విడుదలైంది. నేనొక నటుడ్ని' అంటూ సాగే ఈ కవితను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్లో ప్రేక్షక హృదయాలకు హత్తుకునేలా చెప్పడం విశేషం. ఈ షాయరీని రచయిత లక్ష్మీ భూపాలందించగా, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా నేపథ్య సంగీతం అందించారు.
ఓ నటుడు పడే అవేదనకు అక్షర రూపం ఇచ్చి మెగాస్టార్ తో చెప్పించిన తీరు హార్ట్ టచింగ్ గా వుంది. గత కొన్ని నెలలుగా కృష్ణవంశీ ఓ తపస్సులా చేస్తూ వస్తున్న 'రంగమార్తాండ'కు చిరు నోట పలికిన షాయరీ ప్రాణం పోయడమే కాకుండా ఈ చిత్ర కథకు అద్దంపడుతూ ఇందులోని రంగస్థల నటుడి భావోద్వేగాలని చక్కగా ఆవిష్కరించిన తీరు అద్బుతం. నేనొక నటుడ్ని.. చమ్కీ బట్టలేసుకుని.. అట్ట కిరీటం పెట్టుకుని.. చెక్క కత్తి పట్టుకుని..కాగితం పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను.. కాలాన్ని బంధించి శాసించే నియంతని నేను..
అంటూ చిరు షాయరీ సాగింది. మధ్యలో నేనొక నటుడ్ని జగనాకి జన్మిస్తాను.. సగానికి జీవిస్తాను.. యుగాలకి మరణిస్తాను.. పోయినా బ్రతికుంటాను.. వంటి చరణాలు ఓ నటుడి పడే మనో వేదనని, ఓ నటుడిగా తన ప్రయాణాన్ని ఆర్థ్రంగా చెబుతున్న తీరుని, అతని మతి అంతరాల్లో దాగున్న విషాదాన్ని స్పష్టం చేస్తున్న తీరు ఖచ్చితంగా రేపు థియేటర్లలో సగటు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఫస్ట్ సింగిల్ గా విడుదల చేసిన ఈ షాయరీతో ఈ మూవీ ప్రమోషన్స్ కి కృష్ణవంశీ శ్రీకారం చుట్టారు. ఈ షాయరీ వీడియోలో చిరు నటించిన పలు సినిమాల ఫొటోలని, పలు చిత్రాల్లోని చిరు హావాభావాలకు సంబంధించిన ఫొటోలని ప్రదర్శించడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.