మెగా ఫాన్స్ అంచనాలకు మించి రంగస్థలం చిట్టిబాబు బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడుతున్నాడు. సౌండ్ ఇంజనీర్ అంటూ చెవులు మోతెక్కిపోయే రికార్డులు సృష్టించాడు. తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన రామ్ చరణ్ రంగస్థలం ద్వారా తనకు డ్యూ ఉన్న ఓవర్సీస్ రికార్డులు సైతం సాధించేలా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి మొత్తం 46 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇది చెర్రి కెరీర్ లోనే హయ్యస్ట్. ఇందులో షేర్ రూపంలో వచ్చిన 19 కోట్ల 35 లక్షల షేర్ కూడా ఇప్పటి దాకా చరణ్ ఏ సినిమాకు మొదటి రోజే రాలేదు. వేసవి తీవ్రంగా ఉన్నా జనం బయటికి ఈజీగా రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా హౌస్ ఫుల్స్ తో రంగస్థలం చేస్తున్న జాతర మామూలుగా లేదు. రామ్ చరణ్ సినిమాల్లో ఇప్పటి దాకా బ్రూస్ లీ 12.7 కోట్ల షేర్- 18 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండగా దాన్ని పెద్ద మార్జిన్ తో రంగస్థలం బీట్ చేసేసింది.
ఈ జోరు కొనసాగేలా ఉండటంతో పాటు మౌత్ పబ్లిసిటీ కూడా పాజిటివ్ గా స్ప్రెడ్ కావడం వసూళ్ళపై చాలా సానుకూలంగా ప్రభావం చూపిస్తోంది. సుమార్ 80 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న రంగస్థలం రెండు వారాలు దాటకుండానే లాభాల్లోకి తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా సుకుమార్ దర్శకత్వం-రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి పెద్ద ఎత్తున ప్రశంశలు దక్కడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ లెక్క 80 కోట్ల షేర్ అందుకోవడం మరీ సులభం కాదు కాని అసాధ్యం అయితే కాదు. ఇదే ఊపు కొనసాగితే మాత్రం దగ్గరలోనే ఈ ఫీట్ సాదిస్తాడు. ఇక ఏరియా వారిగా షేర్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. ట్రేడ్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అవి ఇలా ఉన్నాయి
నైజాం 4, 43, 00, 000
సీడెడ్ 3, 70, 00, 000
నెల్లూరు 75, 00, 000
గుంటూరు 2, 73, 00, 000
కృష్ణా 1, 36, 00, 000
వెస్ట్ 1, 60, 00, 000
ఈస్ట్ 2, 03, 00, 000
ఉత్తరాంధ్ర 2, 43, 00, 000
ఈ లెక్కన రంగస్థలం బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తున్నట్టే. గత నెలకు పైగా మాస్ ని మెప్పించే సినిమా ఏది లేక డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు చిట్టిబాబు ఇచ్చిన ఎనర్జీ మామూలుగా లేదు. సోమవారానికి వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి, టాప్ 5 లో చేరుతుందా లేదా అనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.
Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!