ఆ పుర‌స్కారం చిట్టిబాబుకే అంకితం!

Update: 2019-07-18 13:50 GMT
ప్ర‌తియేటా సైమా అవార్డ్స్ వేడుక‌లు ఏదో ఒక‌ గ‌ల్ఫ్ దేశంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ఖ‌తార్- దోహాలో ఈ వేడుక‌ను ఆగ‌స్టు 15- 16 తేదీల్లో నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డికి తెలుగు-తమిళ- కన్నడ- మలయాళ చిత్రాల‌కు చెందిన ప‌లువురు స్టార్లు హాజ‌రుకానున్నార‌ని తెలుస్తోంది. ఈసారి తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి 2018 చిత్రాల్లో రంగ‌స్థ‌లం-భ‌ర‌త్ అనే నేను- గీత గోవిందం- అర‌వింద స‌మేత‌- మ‌హాన‌టి చిత్రాలు పోటీప‌డుతున్నాయి. ఉత్త‌మ నటుడు కేట‌గిరీలో దుల్కర్‌ సల్మాన్‌(మహానటి)- మహేశ్ (భరత్‌ అనే నేను)- ఎన్టీఆర్‌ (అరవింద సమేత వీర రాఘవ)- రామ్‌ చరణ్‌(రంగస్థలం)- సుధీర్‌ బాబు (సమ్మోహనం)- విజయ్‌ దేవరకొండ(గీతగోవిందం) పేర్లు నామినేష‌న్ల‌లో ఉన్నాయి.

ఈసారి సైమా అవార్డుల్లో మెజారిటీ పుర‌స్కారాలు `రంగ‌స్థ‌లం` చిత్రానికి ద‌క్క‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో చిట్టిబాబు గా రామ్ చ‌ర‌ణ్ .. రామ‌ల‌క్ష్మిగా స‌మంత న‌ట‌న‌కు అద్భుత ప్ర‌శంస‌లు ద‌క్కాయి. చిట్టిబాబుకు ఉత్త‌మ న‌టుడుగా అవార్డు ద‌క్క‌డం ఖాయం అని ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్త‌మ న‌టి కేట‌గిరీలో మ‌హాన‌టి సావిత్రిగా న‌టించిన కీర్తి సురేష్ కి ఉత్త‌మ న‌టి పుర‌స్కారం ద‌క్క‌నుంద‌ట‌. కీర్తి కి ఇదివ‌ర‌కూ ఆస్ట్రేలియాలోనూ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అలాగే రంగ‌స్థ‌లం చిత్రానికి గాను సుకుమార్.. భ‌ర‌త్ అనే నేను చిత్రానికి గాను కొర‌టాల ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేట‌గిరీలో ఠ‌ఫ్ కాంపిటీట‌ర్స్ గా ఉన్నార‌ట‌.

ఉత్తమ నటి కేట‌గిరీ కోసం కీర్తి సురేష్ తో పాటు అదితి రావ్‌ హైదరీ (సమ్మోహనం) - అనుష్క (భాగమతి)-  కీర్తి సురేష్‌ (మహానటి)- రష్మిక మంద‌న (గీత గోవిందం)- సమంత (రంగస్థలం) పోటీప‌డుతున్నారు. ఇక ఈ వేడుక‌ల్లో అవార్డులు గెలుచుకున్న స్టార్లు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. ఇత‌ర కేట‌గిరీల వాళ్లు రెండ్రోజుల‌ ఈవెంట్ల‌కు ఎటెండ‌వుతున్నార‌ట‌. నాలుగు భాష‌ల నుంచి తారాతోర‌ణం ఇక్క‌డ కొలువు దీర‌నుంది.


Tags:    

Similar News