ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు తెలుగు సినిమాలకు కీలకం అయిపోయింది. అక్కడ ప్రీమియర్స్ నుంచి వచ్చిన టాక్.. ఇక్కడి రిజల్ట్ ను డిసైడ్ చేసేయగల రేంజ్ కు వచ్చింది. ఇక్కడి ఏరియాలకు సమానంగా.. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు అంతకు మించిన వసూళ్లు కూడా ఓవర్సీస్ నుంచి వచ్చేస్తున్నాయి.
ఇప్పటివరకూ బాహుబలి పేరిట చాలానే రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఓవర్సీస్ లో రంగస్థలం సునామీ కొనసాగుతోంది. ప్రీమియర్స్ రూపంలో 7.06 లక్షల డాలర్లు సాధించిన ఈ చిత్రం.. తొలి రోజు.. రెండో రోజూ కూడా వసూళ్ల వర్షం కురిపించింది. శుక్రవారం కంటే శనివారం నాడు కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయంటే.. చిట్టిబాబు ఎంతగా కనెక్ట్ అయిపోయాడో అర్ధమవుతుంది. ఇక ఆదివారం ప్రీ బుకింగ్స్ సమయానికే.. రంగస్థలం 2 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుంది. అంటే మూడో రోజు ప్రారంభమైన కొన్ని గంటలకే 2 మిలియన్ల మార్క్ ను అందుకుందన్న మాట.
బాహుబలి తర్వాత అత్యంత వేగంగా ఈ మార్క్ ను అందుకున్న చిత్రంగా రంగస్థలం నిలిచింది. మహేష్ బాబు శ్రీమంతుడు కూడా ఆదివారం నాటికి ఈ మార్క్ ను అందుకుంది కానీ.. రంగస్థలం అంతకంటే కొన్ని గంటల ముందే చేరగలిగింది. పైగా వసూళ్లు కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రంగస్థలం 3 మిలియన్ల మార్క్ ను అందుకోవడం తేలికే అంటున్న ట్రేడ్ అనలిస్టులు.. ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేయగలుగుతుందో అని ఆసక్తిగా ఉన్నారు.