రంగస్థలం కొత్త ప్లాన్.. వర్కవుటవుద్దా?

Update: 2018-03-22 08:01 GMT
నిజంగా అప్పట్లో ఒక సినిమా రిలీజ్ అయ్యేంత వరకు సినిమాపై ఎలాంటి అంచనాలు ఉండేవి కావు. ఓ విధంగా అంచనాలు ఎంత పెరిగినప్పటికి యావరేజ్ గా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం చూపేవి కావు. కానీ ప్రస్తుతం సినిమాపై కాస్త అంచనాలు పెరిగినా సినిమా రిజల్ట్ పై ప్రభావం చాలానే చూపిస్తోంది. అనుకున్నంత లేకపోతే డిజాస్టర్ అనే ముద్ర పడిపోతుంది. అందుకే ఎక్కువగా నష్టపోకూడదని ఎక్కువ థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తుంటారు.

కలెక్షన్స్ వస్తే మొదటి వారంలోనే వచ్చేయాలి. అలా అయితేనే నష్టాల బారిన పడకుండా ఉంటారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాపై కూడా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ కొత్తగా కనిపిస్తుండడం. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. సుకుమార్ దర్శకత్వం. ఇవన్నీ సినిమా స్థాయిని పెంచాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం మరి ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేయకూడదు అనే ఆలోచనలో ఉందట. ముఖ్యంగా ఎక్కువ థియేటర్స్ లలో రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది.

అసలే మెగా అభిమానులు ప్రతి సెంటర్లో ఉంటారు. సినిమా అన్ని సెంటర్ల లో రిలీజ్ అవుతుంది కదా అని ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం వేరే ఆలోచనలో ఉంది. సినిమా టాక్ ని బట్టి థియేటర్స్ సంఖ్యను పెంచాలని ప్లాన్ వేస్తున్నారట. ఆ విధంగా చేస్తే బిజినెస్ పెరగవచ్చు కానీ అంత లోపు పైరేసి ని అపాల్సి ఉంటుంది. మరి ఈ ప్లాన్ ని రంగస్థలం ఎంతవరకు అమలు పరుస్తుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చ్ 30న రిలీజ్ కానుంది.
Tags:    

Similar News