సంఘంలో యాసిడ్ బాధితుల ధైన్యం గురించి తెలిసిందే. నేను కూడా అలాంటి బాధితుల్లో ఒకరిని అని అంటోంది కంగన సోదరి రంగోలి. వన్స్ అపాన్ ఏ టైమ్ .. అంటూ క్వీన్ కంగన సోదరి రంగోలి తనకు జరిగిన ఓ ఘోరమైన సంఘటన షాక్ కి గురి చేస్తోంది. నేను అప్పట్లో కాలేజ్ డేస్ లో ఓ ఫోటోని ట్విట్టర్ లో పెట్టాను. దానికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. బావున్నావ్.. అందంగా ఉన్నావ్! అంటూ బోయ్స్ పొగిడేశారు.
అయితే ఒక లీటర్ యాసిడ్ ని బాటిల్ తో నా ముఖంపై కుమ్మరించిన ఘటనకు కొద్దిరోజుల ముందు ఫోటో అది. ఎవరైతే నా ముఖంపై యాసిడ్ వేశాడో వాడు బెయిల్ తో బయటికి వచ్చేశాడు. కానీ ఆ దాడి నా జీవితాన్ని అతలాకుతలం అయ్యింది. ఆ యాసిడ్ దాడి వల్ల 54 సర్జరీలు చేశారు. ఆ టైమ్ లో నా చిన్న చెల్లెలుని చచ్చేంతగా కొట్టారు. ``ఈ లోకం లో అమ్మాయిల జీవితాలే అంత. ఎంతో బాధ కలిగింది`` అని చెబుతూ మరో ఫోటోని పోస్ట్ చేశాను. 54 సర్జరీల తర్వాత నా ఫేస్ ఇలా మారింది. ఆ ఘటన తర్వాత డాక్టర్లకు నా చెవిని తిరిగి అతికించడం అసాధ్యమైంది. ఇలాంటి భయానక అనుభవాలతో ఎంతో కోల్పోయాను. ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. నాకు కొడుకు పుట్టినా బ్రెస్ట్ ఫీడింగ్ సమస్యలు తలెత్తాయి... అని రంగోలి తెలిపారు.
ఏ కుర్రాడు నాపై యాసిడ్ పోసాడో అతడు కొన్ని వారాలకే బెయిల్ తీసుకుని జైలు నుంచి బయట పడ్డాడు. వాడిని చూశాక ఎంతో బాధ కలిగింది. నేను ఇక కేసును ఫాలో చేయడం ఆపేశాను. ఇలాంటి వాళ్లు చావాలి తప్ప కేసులు వేసి ప్రయోజనమే లేదు. అసలు అందం అంటేనే అసహ్యించుకునేంతగా మారిపోయాను .. అని రంగోలి తెలిపింది. యూనివర్శిటీ టాపర్ గా ఉండే నేను నా యంగ్ ఏజ్ అంతా ఆపరేషన్ థియేటర్ లోనే గడపాల్సి వచ్చింది. ఆస్పత్రికే అంకితమవ్వాల్సిన ధైన్యం ఎదురైంది. ఆ దాడి వల్ల 90శాతం తగలబడిపోయాను అని విషాదం గురించి తెలిపింది. యాసిడ్ బాధితులకు ఇప్పటికీ రిజర్వేషన్లు లేవు అన్న సంగతిని రంగోలి చెప్పడం షాక్ కి గురి చేస్తోంది. ఈ పురుషాధిక్య ప్రపంచంపై కంగన-రంగోలి సిస్టర్స్ విరుచుకుపడడం వెనక ఆవేదన ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా? ప‌్రతి మార్పు వెనక.. ప్రతి దాని వెనక ఏదో ఒక కారణం అయితే ఉంటుందని రంగోలి ఇన్సిడెంట్ క్లారిటీగా చెబుతోంది.