బాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా హీరోయిన్ కంగనా రనౌత్ కంటే ఆమె సిస్టర్ రంగోలి ఎపుడు వార్తల్లో నిలుస్తుంది. ఒక్కోసారి ఆమె వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తుంటాయి. అంతేకాదు బాలీవుడ్‌లో జరిగే సంఘటనల పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది కంగనా సోదరి రంగోలి. ఇప్పటికే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వాళ్లకు నచ్చిన వాళ్లకే ఇచ్చుకుంటారు. కానీ యాక్టింగ్ మంచిగా చేసినవాళ్లకు కాదు అంటూ కాస్త ఘాటుగా అప్పట్లో స్పందించింది. మరోవైపు దర్శకులు మహేష్ భట్, కరణ్ జోహార్ ల తీరుపై తనదైన శైలిలో వారిని ఉతికి ఆరేసింది. ఆ తర్వాత జేఎన్‌యూకు వెళ్లి ఒక వర్గం విద్యార్ధులకు మద్ధతు తెలిపిన దీపికాను తనదైన శైలిలో ఎండగట్టింది. అంతకు ముందు హృతిక్ రోషన్ తన చెల్లెలును మోసం చేసింది అంటూ ఆరోపణలు గుప్పించింది.
కాగా బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా వైరలవ్వడంతో రంగోలి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు రీమా కగ్టి, నటి కుబ్రా సైత్‌తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సహా ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు.
ఒక వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రంగోలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ట్యాగ్ చేశారు. అలా విషయం పెద్దది అవడంతో గత కొన్ని రోజులుగా ముందు వెనక చూసుకోకుండా పోస్ట్ చేసిన రంగోలి అకౌంట్ నీ సస్పెండ్ చేసిందట ట్విట్టర్. ఒక్కోసారి ట్విట్టర్ ఒకరోజు నుంచి వారం రోజుల వరకు సదరు వ్యక్తి ట్విట్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉంటాయి. మరి కంగనా సోదరి రంగోలి ట్విట్టర్ అకౌంట్‌ను ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తుందో చూడాలి.