రంగోలి చందేల్ హీరోయిన్ కాదు. రాజకీయ నాయకురాలు కాదు. స్పోర్ట్స్ పర్సన్ అంతకంటే కాదు. అయినా ఆమె పేరు తెలియని నెటిజనులు చాలా తక్కువమంది ఉంటారు. కారణం ఏంటంటే ఆమె నోరు. తప్పో.. ఒప్పో.. ఇతరుల తుప్పు వదలగొట్టేలా మాట్లాడడం.. వీలైతే ఇతరుల చర్మాలు ఒలిచి చెప్పులు కుట్టించుకునే ప్రయత్నాలు చేయడంతో రంగోలి చాలా పాపులర్ అయింది. అయినా ఆమె ఎవరో మాకు తెలియదు అని మీరు అన్నారంటే మీరు అప్డేటెడ్ గా లేనట్టే.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రియమైన సోదరి ఆమె. మొదట్లో కంగనాకు సపోర్ట్ గా మాట్లాడి తన వాగ్ధాటిని నిరూపించుకుంది. ఎదురుగా ఎవరున్నా సరే ఎడాపెడా వాయించడం ఒకటే ఆమెకు తెలుసు. ఇప్పుడు మాత్రం కంగనాకు సంబంధం లేని అంశాలపై కూడా రంగోలి తన అమూల్యమైన అభిప్రాయాలు తెలపడం ప్రారంభించింది. రీసెంట్ గా కియారా అద్వాని తన కొత్త సినిమాను ప్రకటించింది. 'ఇందూ కి జవానీ' అనేది సినిమా టైటిల్. డేటింగ్ సైట్స్ లో ఎవరో ఒకరిని చూసుకోవడం డేటింగ్ చేయడం... మళ్ళీ ఇంకొకర్ని వెతుక్కోవడం వారితో డేటింగ్ చేయడం.. ఇదీ సినిమాలో కియారా పాత్ర. ఈ సినిమా గురించి తెలుపుతూ సోషల్ మీడియా లో #గర్ల్ పవర్ అనే హ్యాష్ టాగ్ ను జోడించింది. దీంతో రంగోలికి చిర్రెత్తుకొచ్చింది.. కియారాను వాయించిపారేసింది.
వరస ట్వీట్లలో "ఒక సినిమాకు 'ఇందు కి జవానీ' అనే టైటిల్ ఎలా పెడతారు? ఒకవైపు మహిళా సాధికారికత అంటారు.. కానీ మహిళలను ఆటబొమ్మల్లాగా చూపిస్తారు. ఇలాంటి సెక్సిస్ట్ సినిమాలను తీసే బాలీవుడ్.. మీ కూతుళ్ళ కళ్ళలో సూటిగా చూడగలరా #షేమ్' అంటూ విమర్శించింది. సెన్సార్ వారు ఇలాంటివి అనుమతించరాదని తన అభిప్రాయం వెల్లడించింది. అయితే ఇప్పటివరకూ కియారా ఈ ఎపిసోడ్ పై స్పందించలేదు. స్పందిస్తే రంగోలి మళ్ళీ జింతాత జిత జిత మొదలుపెడుతుంది!