అక్కడ షూటింగ్ అంత కష్టపడి చేశారా

Update: 2017-02-01 04:40 GMT
షాహిద్ కపూర్.. కంగనా రనౌత్.. సైఫ్ అలీ ఖాన్ లు నటించిన రంగూన్ మూవీ.. ఈ నెలలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ తో.. అందులో కంగనా బోల్డ్ సీన్స్ తో బోలెడంత సెన్సేషన్ అయిపోయింది రంగూన్. రెండో ప్రపంచ యుద్ధం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పుడు ప్రమోషన్స్ లో వేగం పెంచింది యూనిట్.

రంగూన్ కోసం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్ చేశారు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ ఆవిష్కరించని ప్రదేశాలను చూపించాడు దర్శకుడు. ఆ  షెడ్యూల్ కి సంబంధించిన చిన్నపాటి వీడియోను రంగూన్ టీం రిలీజ్ చేసింది. వీళ్ల షూటింగ్ స్పాట్ కి వెళ్లేందుకే నాలుగైదు రకాల వాహనాల్లో జర్నీ చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పటివరకూ తన జీవితంలో అత్యంత కష్టమైన షెడ్యూల్ ఇదే అన్నాడు షాహిద్. కంగనా అయితే మరింత బోల్డ్ గా విషయాలు చెప్పేసింది. ఇక్కడి షూటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నా.. కనీసం టాయ్ లెట్స్ కూడా లేవని.. ఏమైనా రాళ్ల వెనకాలే అనేసింది కంగనా.

ప్రతీ రోజు ట్రెకింగ్ రేంజ్ లో షూటింగ్ చేశారంటే రంగూన్ టీం కష్టం అర్ధమవుతుంది. ఇక అక్కడి వాటర్ అయితే.. మంచు మాదిరిగా అతి శీతలంగా ఉంటాయి. వాటిలో కూడా కొన్ని సీన్స్ తీశారులే. మరి రంగూన్ యూనిట్ పడ్డ ఇంత కష్టానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం.. రిలీజ్ డేట్ అయిన ఫిబ్రవరి 24వరకూ ఆగాల్సిందే.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News