టిప్పు టాప్పుగా సోకిలాడిలా రెడీ అయ్యి పెళ్లిల్లు విందులు వినోదాలకు ఎటెండవ్వడం బాలీవుడ్ వెటరన్ స్టార్లకు అలవాటు వ్యాపకమే. కొందరు లేడీస్ గుంపులు గుంపులుగా వెళుతుంటారు. అంతేనా.. అక్కడ ఎవరికి వారు తమ సోకుల్ని సింగారాన్ని రిచ్ గా ప్రెజెంట్ చేసేందుకు ఆరాటపడుతుంటారు. ఆరాటంతో కూడుకున్న ఉబలాటంతో అన్నీ బ్రాండెడ్ వే కొనుక్కోవడం వీళ్ల హ్యాబిట్. ఒక్కోసారి బెత్తెడు సైజు అయినా లేని హ్యాండ్ బ్యాగ్ కోసం వేలకు వేలు లక్షల్లోనూ తగలేయడం ఈ నటీమణులకే చెల్లింది. అదంతా ప్రెస్టేజ్ వరల్డ్ కాబట్టి అక్కడ అందరూ ఇంతే.
తాజాగా ఓ పెళ్లి వేడుకకు ఎటెండయినా రాణీ ముఖర్జీ హ్యాండ్ బ్యాగ్ ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసలే సభ్యసాచి శారీలో దుమారం రేపిన రాణీజీ దానికి కాంట్రాస్టుగా అత్యంత బుల్లి హ్యాండ్ బ్యాగుని తగిలించుకుని పదిమంది కంటా పడడంతో అందరి చూపు అటువైపే వెళ్లిపోయిందట. సహజంగానే నలుగురు ఆడాళ్లు గుమిగూడితే ఇతర మగువల ఫ్యాషన్స్ స్టైల్స్ గురించి వాళ్లు ఉపయోగించే బ్యాగుల ఖరీదు గురించి ముచ్చటించుకోవడం చూసేదే. ఇంతకీ ఆ క్యూట్ బ్యాగు ఖరీదు ఎంత? అన్నది ఆరా తీస్తే.. అక్షరాలా యాభై వేలు (రూ.50000) అని తేలింది. అసలు ఆ బ్యాగు సైజుకి ఆ ఖరీదుకి ఏమైనా సింక్ ఉందా? అని అనుకోవద్దు.. అది ప్రఖ్యాత `డోల్స్ & గబన్నా బ్యాగ్`. కాస్ట్ ఇలానే పేల్తుంది. నచ్చితే కొనుక్కోవాలి.. లేదంటే చూసి వెళ్లిపోవాలంతే.
రాణీజీ కెరీర్ సంగతి ముచ్చటిస్తే.. ఇటీవలే `మర్దానీ 2` రిలీజైంది. లేడీ ఓరియెంటెడ్ స్టోరి అయినా బాక్సాఫీస్ వద్ద బాగానే వర్కవుటైంది. తదుపరి `బంటీ ఔర్ బాబ్లి 2` లో నటిస్తోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్- సిద్ధాంత్ చతుర్వేది -శార్వారి వాగ్ లాంటి తారలతో పాటుగా రాణీజీ నటిస్తోంది. `హమ్ తుమ్` తర్వాత చాలా కాలానికి సైఫ్ సరసన జత కడుతోంది.