క్రికెట్ అంటే భారత్ లో ఒక మతం.. క్రికెట్ అంటే దేశంలోని జనాలకు ప్రాణం.. క్రికెట్ లేని భారత్ ను అస్సలు ఊహించలేం. ఐపీఎల్ అయినా.. ఇండియన్ క్రికెట్ అయినా పిచ్చిగా చూస్తారు.. ప్రపంచ క్రికెట్ లో భారత్ నుంచి చూస్తే రెండు అద్భుత ఘట్టాలు.. ఒకటి కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో ప్రపంచకప్ గెలవడం.. ఆ తర్వాత ఎంఎస్ ధోని నేతృత్వంలో 2011లో ఇదే ప్రపంచకప్ ను ముద్దాడడం. ఈ రెండు విజయాలు ప్రపంచ క్రికెట్ లోనే మరుపురాని ఘట్టాలు..
1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో దేశానికి కప్ అందించారు. దేశానికి హీరోలుగా నిలిచారు. ఈ నేపథ్యంలో నాటి అపూర్వఘట్టాన్ని తెరపై చూపించడానికి రంగం సిద్ధమైంది. సినిమాగా 1983 విజయాన్ని తీస్తున్నారు. రణ్ వీర్ సింగ్ హీరోగా ‘83’ పేరుతో రూపొందిన ఈ హిందీ సినిమాకు ఇప్పుడు దేశంలో ఫుల్ క్రేజ్ ఉంది. లాక్ డౌన్ తో విడుదల వాయిదా పడిన ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ధోని బయోపిక్ కు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు అదే బాటలో రణ్ వీర్ ‘83’కి ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు ఓ వెబ్ స్ట్రీమింగ్ యాప్ వాళ్లు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.
లాక్ డౌన్ తో విడుదల వాయిదా పడిన ఈ సినిమాను తమ స్ట్రీమింగ్ యాప్ ద్వారా విడుదల చేస్తే 144 కోట్ల రూపాయాల మొత్తాన్ని ఇస్తామని ఆఫర్ చేశారట.. ఈ సినిమాను వారు కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారని సమాచారం.
అయితే 83 నిర్మాతలు మాత్రం దీన్ని థియేటర్స్ లోనే విడుదల చేయాలని దేశవ్యాప్తంగా 500 కోట్లకు పైగా రాబట్టాలని వెయిట్ చేస్తున్నారట.. చూడాలి మరీ ఏం జరుగుతుందో..