ఆ యాడ్ విషయంలో సారీ!!

Update: 2016-11-27 04:38 GMT
సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ అనే విషయం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి బాగానే తెలిసొచ్చినట్లుంది. నచ్చినట్లుగా వాడేసుకుని ప్రమోషన్స్ చేసుకోవడానికే కాదు.. తేడా వస్తే జనాలు ఏ రేంజ్ లో తిట్టిపోస్తారో కూడా రణవీర్ కి అనుభవంలోకి వచ్చేసింది.

జాక్ అండ్ జోన్స్ అనే కంపెనీకి రణవీర్ చేసిన ఓ ప్రకటన వివాదం సృష్టించింది. 'ఆఫీస్ పనిని ఇంటికి తీసుకెళ్లండి' అనే అర్ధం వచ్చేలా స్లోగన్ రాసి.. అమ్మాయిని భుజాన వేసుకున్న రణవీర్ సింగ్ ఫోటో ఒకటి.. పోస్టర్లలో ఫ్లెక్సీలలో నింపేశారు. దీనికి సిద్ధార్ధ్ లాంటి హీరోలతో పాటు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మహిళలను అవమానించడంలో ఇదో ఎక్స్ ట్రీమ్ స్టెప్ అంటూ తిట్టి పోసేశారు. దీంతో తప్పు తెలుసుకున్న కంపెనీ ఆ పోస్టర్లను తీసేసినట్లు చెబుతుంటే.. రణవీర్ సింగ్ కూడా క్షమాపణలు వేడుకోవాల్సి వచ్చింది.

'కంపెనీ వాళ్ల క్రియేటివిటీని గౌరవించాలని.. వాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వడం ముఖ్యమని భావించాను. ఇలా అవుతుందని అనుకోలేదు. కానీ ఇది పూర్తయిపోయిన విషయం. ఇప్పటికే చాలా సిటీస్ నుంచి ఈ బిల్ బోర్డ్ లను తొలిగిస్తున్నారు. వ్యక్తిగతంగాను.. ప్రొఫెషనల్ గాను మహిళలను ఎంతో గౌరవిస్తాను. మరోసారి వారి గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించను' అంటూ పాపపరిహార పత్రం మాదిరిగా స్టేట్మెంట్ ఇచ్చాడు రణవీర్ సింగ్. ఒకవేళ ఇలాంటి యాడ్ ను తన ప్రియుడు కాకుండా వేరు వారు చేసుంటే.. మరి ఇతగాడి ప్రియురాలు దీపిక పడుకొనె ఏమనేదో. రచ్చరచ్చ చేసేదంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News