బేఫికర్‌ గా ముద్దెట్టేశాడుగా!!

Update: 2016-04-09 11:30 GMT
బాలీవుడ్‌ లో ప్రొఫెషనిలజం అనే మాట ఇప్పుడు పిచ్చ పీక్స్‌ లో వినిపిస్తోంది. ఎందుకంటే అక్కడ రియల్‌ లైఫ్‌ కపుల్స్‌ అయిన స్టార్‌ హీరో హీరోయిన్లు ఆన్‌ స్ర్కీన్లో కూడా తమ పార్టనర్లు జెలస్‌ ఫీలయ్యే రేంజులో పెదవి చుంబనాలు లాగించేస్తున్నారు.

మొన్నామధ్యనే.. హీరో రణవీర్‌ సింగ్‌.. తన కో-స్టార్‌ అండ్‌ మాజీ లవర్‌ అనుష్క శర్మ పెదాలను జుర్రుకున్నాడు. ''దిల్‌ దడకనే దో'' సినిమా కోసం వీరు చేసిన ఫీట్లు అన్నీ ఇన్నీ కాదు. అమ్మడు ఏకంగా కేవలం బ్రా వేసుకొని సెమీ న్యూడ్‌ గా నటించింది కూడా. అంతకంటే ముందు.. దీపికా పదుకునే కూడా.. సేమ్‌ అలాగే బ్రా లో కనిపిస్తూ.. ''ఫైండింగ్‌ ఫ్యానీ'' సినిమా కోసం అర్జున్‌ కపూర్‌ తో లిప్స్‌ లాకింగ్‌ చేసింది.  ఆ తరువాత మాజీ ప్రియుడు రణబీర్‌ కపూర్‌ తో కూడా ''తమాషా'' సినిమాలో అలానే చుంబించింది. ఇక రియల్‌ లైఫ్‌ లో రణవీర్‌ అండ్‌ దీపికలు ఏ రేంజ్‌ లవర్సో మనకు తెలిసిందే.

ప్రస్తుతం హాలీవుడ్‌ లో సినిమా చేస్తున్న దీపిక.. హీరో విన్‌ డీజిల్‌ తో ఖచ్చితంగా ఒక లాక్‌ లాగిస్తుంది. మరి రణవీర్‌ ఏమన్నా తక్కువ తిన్నాడా.. త్వరలో రాబోయే ''బేఫికర్‌'' సినిమా కోసం హీరయిన్‌ వాణి కపూర్‌ పెదాలను తన పెదాలతో లాక్‌ చేసి.. దానినే ఫస్ట్‌ లుక్‌ గా విడుదల చేశాడు. చాన్నాళ్ళ తరువాత ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
Tags:    

Similar News