టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా టెంపర్ ను బాలీవుడ్ లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన సింబా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా 100 కోట్లు వసూళ్లు సాధిస్తుందని భావించారు. కానీ అనూహ్యం గా ఈ సినిమా 150 కోట్లు - 200 కోట్లు సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది. 200 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు చేసి అక్కడితో ఆగుతుందని భావించారు.
వరుస సెలవులు మరియు బాలీవుడ్ లో మరే సినిమాలు కూడా లేకపోవడంతో భారీగా ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. విడుదలైన మూడు వారాల్లో ఏకంగా 350 కోట్లను వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించాడు. ఇండియాలో ఈ సినిమా 220 కోట్లను రాబట్టింది. ఇక ఓవర్ సిస్ లో కూడా ఈ సినిమా 130 కోట్లు రాబట్టింది.
బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసిన కరణ్ జోహార్ ఇప్పటి వరకు ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టలేక పోయాడు. దర్శకుడు రోహిత్ శెట్టి కూడా ఇప్పటి వరకు ఇంత భారీ వసూళ్లను రాబట్టింది లేదు. ఇదే జోరు రిపబ్లిక్ డే వరకు కొనసాగే అవకాశం ఉంది. మరి ఇంకొన్ని రోజుల్లో 400 కోట్లకు ఈ సినిమా కలెక్షన్స్ చేరే అవకాశం ఉంది.