టాప్ హీరో నగ్నావతారం

Update: 2016-05-18 08:14 GMT
హీరోయిన్లు న్యూడ్ గా కనిపించడం అన్నది పాత విషయం.. ఇప్పుడు హీరోలు ఈ బాటలో సాగుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా నగ్నావతారం ఎత్తేస్తున్నారు. ఆల్రెడీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ‘పీకే’ సినిమాలో దాదాపు నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. జాన్ అబ్రహాం.. రణబీర్ కపూర్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. ఇప్పుడు టాప్ హీరోగా ఎదుగుతున్న రణ్వీర్ సింగ్ వంతు వచ్చింది. తన కొత్త సినిమా ‘బేఫికర్’ కోసం అతను నగ్నావతారంలో కనిపించబోతున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా చాలా ఏళ్ల విరామం తర్వాత మెగా ఫోన్ పడుతున్న సినిమా ఇది.

ఇప్పటికే లిప్ లాక్ పోస్టర్లతో ‘బేఫికర్’ బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. రణ్వీర్ సింగ్-వాణి కపూర్ కలసి ఈ సినిమా కోసం 23 లిప్ లాక్స్ చేయడం విశేషం. ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం చేసిన రెండు లిప్ లాక్ పోస్టర్లు వేడి పుట్టించాయి.

ఇప్పుడిక రణ్వీర్ న్యూడ్ లుక్ వ్యవహారం అమ్మాయిల్ని బాగానే ఆకర్షించే అవకాశముంది. రెండు దశాబ్దాల కింద ‘దిల్వాలే దుల్హానియా లే జాయేంగే’ సినిమాతో బాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య చోప్రా.. ఆ తర్వాత 20 ఏళ్లలో తీసింది రెండే సినిమాలు.. మొహబ్బతే.. రబ్ నే బనా దె జోడీ. ఇప్పుడు ‘బేఫికర్’తో డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అతనంటున్నాడు.
Tags:    

Similar News