వేరే భాష‌లో సినిమా చేయ‌ను అనేశాడు

Update: 2016-12-17 22:30 GMT
వేరే భాష‌ల‌కు చెందిన న‌టులు మ‌న వాళ్ల‌కు ఉపాధి లేకుండా చేస్తున్నార‌ని కోట శ్రీనివాస‌రావు లాంటి పెద్ద‌వాళ్లు త‌ర‌చుగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. కానీ ఆయ‌న మాత్రం వేరే భాష‌ల్లో న‌టించ‌ట్లేదా అని ప్ర‌శ్నించేవాళ్లూ లేక‌పోలేదు. ఐతే అలా న‌టించాలంటే ఒక స్టేచ‌ర్ ఉండాల‌న్న‌ది కోట వాద‌న‌. ఐతే కోట త‌ర్వాత ఆ స్థాయిలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ క‌మ్ విల‌న్ గా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న రావు ర‌మేష్ మ‌రో భాష‌లో న‌టించేంత స్టేచ‌ర్ సంపాదించిన‌ప్ప‌టికీ.. ఆ అవ‌కాశాల్ని తాను ఒప్పుకోవ‌ట్లేద‌ని అంటున్నాడు. తాను తెలుగులో మాత్ర‌మే సినిమాలు చేస్తాన‌ని రావు ర‌మేష్ తేల్చి చెప్ప‌డం విశేషం.

‘‘ప్ర‌స్తుతానికి నాకు వేరే భాష‌ల్లో సినిమాలు చేసే ఉద్దేశాలేమీ లేవు. నాకు వేరే భాష‌ల్లో రెండు మూడు అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ చేయ‌లేదు. లోక‌ల్ ఆర్టిస్టుల ఉపాధిని దెబ్బ తీస్తున్నాన‌ని వేరే భాష‌ల వాళ్లు న‌న్ను నిందించ‌కూడ‌ద‌న్న‌ది నా ఉద్దేశం. అందుకే వేరే భాష‌ల్లో సినిమాలు చేయ‌ట్లేదు. అదే స‌మ‌యంలో ఒక విష‌యం చెప్ప‌ద‌లుచుకున్నా. దేశంలో ప‌ర భాషా న‌టుల‌కు అత్య‌ధికంగా అవ‌కాశాలిస్తున్న ఇండ‌స్ట్రీ మ‌న‌దేన‌ని నా ఉద్దేశం’’ అని రావు ర‌మేష్ చెప్పాడు. త‌న‌కు బేసిగ్గా విల‌న్ పాత్ర‌లు చేయ‌డ‌మంటే ఇష్ట‌మ‌ని.. జ‌నాలు కూడా ఆ పాత్ర‌ల్లో త‌న‌ను చూడ‌టానికి ఇష్ట‌ప‌డుచెడ్డ‌వాడిగా పెర్ఫామ్ చేయ‌డానికి చాలా అవ‌కాశ‌ముంటుంద‌ని రావు ర‌మేష్ అన్నాడు.
Tags:    

Similar News