'అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఊర మాస్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటిని నిజం చేస్తూ మేకర్స్ వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను అధికారికంగా ప్రకటించారు.
#BOTAPATIRAPO అనే హ్యాష్ ట్యాగ్ తో బోయపాటి శ్రీను - రామ్ కాంబో సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఇది బోయపాటి కెరీర్ లో 10వ చిత్రం.. రామ్ కు 20వ సినిమా. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న 'ది వారియర్' అనే ద్విభాషా చిత్రానికి కూడా ఆయనే నిర్మాత.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో 'బోయపాటి - రామ్' సినిమా రూపొందనుంది. ఇది అగ్ర దర్శకుడి కెరీర్ లలో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. పవర్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ కథతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
ఈ ప్రాజెక్ట్ గురించి ఉస్తాద్ హీరో రామ్ పొతినేని ట్వీట్ చేస్తూ.. ''#RAPO20 ఇప్పుడు #బోయపాటిరాపో అయింది. డాడీ ఆఫ్ మాస్ ఎమోషన్స్ బోయపాటి గారి కళ్లలో నన్ను నేను చూసుకోడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నాను'' అని పేర్కొన్నారు. గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చబోతోందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
రామ్ తన డబ్బింగ్ చిత్రాలతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. మరోవైపు బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల హిందీ వెర్సన్స్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబడుతుంటాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా అంటే తెలుగుతో పాటుగా నార్త్ మార్కెట్ లోనూ డిమాండ్ ఉంటుంది.
ఇక బోయపాటి శ్రీను చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ - ఎమోషనల్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన ఊర మాస్ కథకు రామ్ పొతినేని ఎనర్జీ జత కలిస్తే #BOTAPATIRAPO సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు.