30 ఇయ‌ర్స్ పృథ్వీకి అరుదైన గౌర‌వం

Update: 2019-08-07 05:34 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లో స‌భ్య‌త్వం కావాలంటే ల‌క్ష పైగా చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తాన్ని పేద క‌ళాకారులు- స్టేజీ క‌ళాకారులు చెల్లించ‌డం అంటే ఆషామాషీ కాదు. కొంద‌రు క‌మ‌ర్షియ‌ల్ కాని న‌టీన‌టులు క‌ళారంగంలో ఉన్నారు. అలాంటి వారంద‌రికీ `మా` బ‌దులుగా వేరొక సంఘం కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది. అదే తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు). న‌టుడు శివ‌శంక‌ర్ ఇదివ‌ర‌కూ ఈ సంఘానికి అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం టీఎంటీఏయు కి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్ప‌టికే ఈ సంఘానికి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగింది.

అయితే ఈసారి ఎవ‌రిని అధ్య‌క్షుడిగా ఎన్నుకోవాలి? అంటే దానికి సంఘం స‌భ్యుల్లో మెజారిటీ భాగం 30ఇయ‌ర్స్ పృథ్వీ రాజ్ స‌రైన ఆప్ష‌న్ అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆయ‌నకు ఉన్న ఛ‌రిష్మా సంఘం బ‌లోపేతం అయ్యేందుకు ఉప‌క‌రిస్తుంద‌ని ఆర్టిస్టులు భావిస్తున్నారు. దాదాపు 750 పైగా స‌భ్యులు ఉన్న టీఎంటీఏయూకి బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం క‌నిపిస్తోంది. ఈ సంఘంలో రెగ్యుల‌ర్ గా బ‌య‌ట‌ప‌డుతున్న లుక‌లుక‌ల్ని ఆప‌గ‌లిగే నాయ‌క‌త్వం అవ‌స‌రం అంటూ ఆర్టిస్టులు కోరుకుంటున్నారు. ప్ర‌తిదానికి చిల్ల‌ర‌గా కీచులాడుకుంటున్న ఆర్టిస్టుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డ‌కుండా ఆప‌గ‌లిగే నాయ‌కుడు కావాల‌ని అంతా కోరుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే పృథ్వీ పేరును ఆర్టిస్టులు బ‌లంగా ప్ర‌తిపాదిస్తున్నారు.

పృథ్వీకి గౌర‌వాన్ని ఆపాదిస్తూ ప‌లువురు ఏమ‌ని కోరుకున్నారో వారి విన్న‌పం ప‌రిశీలిస్తే ఇదిగో ఇలా ఉంది. ``మన తెలంగాణా మూవీ  టీవి ఆర్టిస్టు యూనియన్  కి  సహాయసహకారాలందించాలనే  సహృదయంతో  ప్రముఖ  నటులు  పృథ్వీగారు  మన యూనియన్ కు అధ్యక్షులుగా  ఉండడానికి  అంగీకరించి నందుకు  ఆనందంగా ఉంది.  మన   కళాకారులకు  తప్పక  మేలు  కలుగుతుందని  నేను  నమ్ముతున్నాను. అలాగే  చాలామంది  పృద్వీగారికి  మద్దతు  ప్రకటిస్తూండడం  ఆనందకరం  మరొక  చిన్న  విన్నపం  మన  సభ్యులందరూ  సృదయంతో  పృథ్వీకి  స్వాగతం  పలికి  ఏకగ్రీవంగా  ఎన్నుకోవడానికి  సహకరించవలసిందిగా  మనవి.  ఎవ్వరూ  పదవికోసం  ఆశ  పడకుండా   కళాకారుల  ఉన్నతికి  తోడ్పడతార‌ని ఆశిస్తున్నాం`` అంటూ ర్యాలి మోహనరావు అనే ఆర్టిస్టు ఆకాంక్షించారు.

``పృద్వీగారు  మన యూనియన్ కు అధ్యక్షులుగా  ఉండడానికి  అంగీకరించి నందుకు సంతోషం.  మన   కళాకారులకు  తప్పక  మేలు  కలుగుతుందని  నేను  నమ్ముతున్నాను.  ఏకగ్రీవంగా  ఎన్నుకోవడానికి  మేం సిద్ధం`` అంటూ ప‌లువురు ఆర్టిస్టులు కోరుకోవ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మూవీ ఆర్టిస్టుల సంఘానికి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతున్న ఈ సంఘంలో చేరేందుకు అంత‌కంత‌కు ఆర్టిస్టుల నుంచి ద‌ర‌ఖాస్తులు వ‌స్తుండ‌డంతో టీఎంటీఏయూకి విలువ పెరుగుతోంది.

మొత్తానికి 30 ఇయ‌ర్స్ పృథ్వీకి ప‌రిశ్ర‌మ‌లో గౌర‌వం అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇటీవ‌ల వైయ‌స్సార్ కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారం చేసి ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అండ‌గా నిలిచారు. ఇటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్నారు పృథ్వీ. అందుకే ఆయ‌న‌కు తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల త‌ర‌పున పూర్తి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News