మల్లూ ల్యాండ్ లో రాశి టాలెంట్

Update: 2017-02-13 05:40 GMT
యంగ్ బ్యూటీ రాశి ఖన్నా టాలీవుడ్ లో  ఏ రేంజ్ అవకాశాలు అందిపుచ్చుకుంటోందో చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు చాలానే సినిమాల ప్రారంభంలో.. ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. వీటిలో కన్ఫాం అయేవి కొన్నే అయినా.. ప్రస్తుతం రాశి ఫుల్ బిజీగానే ఉంది. రీసెంట్ గా కోలీవుడ్ లో కొన్ని సినిమాలు సైన్ చేసేసి అక్కడ పాగా వేసేందుకు ప్రిపేర్ అవుతూనే.. మరోవైపు మల్లూ ల్యాండ్ పై కూడా కన్నేసింది రాశి ఖన్నా.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సైన్ చేసింది రాశి ఖన్నా. ఇందులో ఈమెది ఓ హీరోయిన్ రోల్ అయినా.. రొమాంటిక్ యాంగిల్ ఏమీ ఉండదు. ఎందుకంటే.. ఈ చిత్రంలో ఓ రిటైర్డ్ పోలీస్ గా మోహన్ లాల్ కనిపించనుంటే.. రాశిఖన్నా కూడా ఖాకీ డ్రస్ లోనే దర్శనం ఇవ్వనుంది. గతంలో సాయిధరం తేజ్ మూవీ సుప్రీంలో బెల్లం శ్రీదేవిగా పోలీస్ అవతారంలో కనిపించినా.. మలయాళంలో నటించనున్న మూవీలో మాత్రం పూర్తి స్థాయిలో యాక్షన్ ఓరియెంటెడ్ లోనే రాశి పాత్ర ఉండనుంది.

ఫుల్ సీరియస్ సాగే ఈ రోల్ పై రాశి ఖన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరోవైపు ఈ సినిమాలో విశాల్ విలన్ గా నటించనుండడం ఒక స్పెషాలిటీ అయితే.. మరో హీరోయిన్ హన్సిక కూడా యాక్ట్ చేస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Tags:    

Similar News