ఇండస్ట్రీలో ఇప్పటితరం హీరోయిన్లు సినిమాల కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు. అందులో భాగంగానే మొదటగా ఫిట్నెస్ అంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలంటే ఫిట్నెస్ తప్పనిసరిగా అయిపోయింది. అందుకే ఒకప్పుడు బొద్దుగా మురిపించిన ముద్దుగుమ్మలు కూడా ఇప్పుడు కష్టపడుతూ నాజూకుగా తయారవుతున్నారు. అలాంటి కఠోరదీక్షతో కష్టపడుతున్న హీరోయిన్లలో ఒకరు రాశిఖన్నా. ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ అక్కడి నుండి వచ్చిందే కానీ సెటిల్ అవుతుంది మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే. ఊహలు గుసగుసలాడే సినిమాతో కెరీర్ ప్రారంభించిన అమ్మడు అప్పట్లో ముద్దుగా బొద్దుగా ఉండేది. ఆ బొద్దు అందాలకే ఫ్యాన్ ఫాలోయింగ్ వెనకేసుకుంది.
అయితే ఎప్పటికప్పుడు సినిమాలకోసం హీరోయిన్స్ తమ బాడీని మేకోవర్ చేస్తుంటారు. బెంగాల్ టైగర్ మూవీలో స్విమ్మింగ్ పూల్ సీన్ తో చిచ్చురేపిన రాశి.. అప్పటినుండి నాజూకుగానే మెయింటైన్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో రాశికి ఫాలోయింగ్ మిలియన్స్ లో ఉంది. అందుకే అమ్మడు అప్పుడప్పుడు తన ఫిట్నెస్ రిలేటెడ్ ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోయర్లను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా రాశి తన ఫిట్నెస్ ప్రాక్టీస్ సంబంధించిన ఫోటో, వీడియో పోస్ట్ చేసింది. కానీ ఈ ఫోటో, వీడియోలో సర్ప్రైజ్ ఏంటంటే బాక్సింగ్ చేస్తూ కనిపించింది రాశి. అమ్మడు బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి ఫోటోకు పోజిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోస్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా అమ్మడు ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.