హైద్రాబాద్ లో చార్మినార్ ఎంత ఫేమస్సో.. హైద్రాబాద్ బిర్యానీ కూడా అంతే ఫేమస్. వేరే ప్రాంతం నుంచి హైద్రాబాద్ వస్తే బిర్యానీ రుచి చూడకుండా ఎవరూ వెళ్లరు. సాధారణ వ్యక్తులే కాదు - సెలబ్రిటీలు - స్టార్ల వరుస కూడా ఇదే. హైద్రాబాద్ అంటే ఎంతిష్టమో తెలుసా అంటూ వయ్యారాలు పోయో హీరోయిన్లు చాలా మందే ఉంటారు. ఈ లిస్ట్ లో కుర్ర బ్యూటీ రాశిఖన్నా కూడా ఉన్నా.. ఇదే విషయాన్ని కొంచెం కొత్తగా చెప్పేసేందుకు ట్రై చేస్తోంది.
'హైద్రాబాద్ వెళ్తే అక్కడి బిర్యానీ తినకుండా రాకు.. అని ఇంట్లో వాళ్లు చెబుతూ ఉంటారు. అందుకే ఇక్కడికి వచ్చిన వెంటనే బిర్యానీ టేస్ట్ చేశాను. సూపర్బ్ గా ఉంది కానీ.. కారం - మసాలాలు మాత్రం ఘాటెక్కించేశాయి. నాకు మామూలుగానే కోపం చాలా ఎక్కువ. ఇంత కారం తింటే ఏమైపోతానో అనిపించింది. అయినా సరే హైద్రాబాద్ బిర్యానీ తినకుండా మాత్రం ఉండలేకపోతున్నా ' అని చెప్పుకొచ్చింది రాశిఖన్నా.
తన కోసం కొంచెం మసాలా తగ్గించి వేయమని చెప్పి స్పెషల్ గా చేయించుకుని మరీ బిర్యానీ ఆరగించేస్తోందట ఈ అమ్మడు. అయితే, ఎంత ఎక్కువగా తిన్నా ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా అలర్ట్ గా ఉంటానని ఫినిషింగ్ ఇస్తోంది ఈ సుప్రీం హీరోయిన్. మెగా సుప్రీం స్టార్ సాయిధరం తేజ్ హీరోగా వస్తున్న సుప్రీంలో రాశిఖన్నా పోలీస్ పాత్రలో ఇరగదీసేస్తోందని టాక్.