పొడవు కాదు... బరువు ముఖ్యం!

Update: 2015-04-12 19:30 GMT
నేను చేసే సినిమాల్లో నా పాత్ర ఎంత పొడవుంది అనే దానికంటే ఎంత బరువైన పాత్ర, ఎంత విలువైన క్యారెక్టర్ అనే దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెడతానని అంటుంది జిల్ భామ రాశీఖన్నా! ప్రాధాన్యం లేని పాత్ర సినిమా మొత్తం ఉన్నా ఏమి ప్రయోజనం అని ఎదురు ప్రశ్నిస్తుంది. తాజాగా జిల్ సినిమాతో కుర్రకారు మనసుల్ని "జిల్"మనిపించిన ఈ బూరుబుగ్గల గుండ్రని పిల్ల ప్రస్తుతం రవితేజ "బెంగాల్ టైగర్ " లో నటిస్తుంది.
ఒక్క పాటతోటి, చిన్న పాత్రతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా పుష్కలంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే నా వరకూ పాత్ర ఎంత పెద్దది, ఎంత చిన్నది అనే దానికంటే... ఆ సినిమాలో ఆ పాత్రకు ఉన్న విలువ ఎంత అనేది ప్రధానం అని నొక్కి వక్కానిస్తుంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో కలిపి స్క్రీన్స్ ని షేర్ చేసుకున్నా... ఎవరిది వారికే ఉంటుందని చెప్పుకొచ్చింది. మూడు సినిమాల్లో నటించిందో లేదో అప్పుడే ఎన్ని తెలివితేటలొచ్చేసాయో పాపకి!
Tags:    

Similar News