బుల్లితెర హాట్ బ్యూటీ యాంకర్ రష్మీ. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. అంతేగాక తనను ఎవరైనా ట్రోల్ చేయాలని చూస్తే ముక్కుసూటిగా జబర్దస్త్ సమాధానాలు ఇస్తుంది. బుల్లితెర మాత్రమే కాకుండా వెండితెరపై కూడా రష్మీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సామాజిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే రష్మీ స్ఫూర్తిని రగిల్చే పోస్టులు పెడుతూ ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఫోటోలు షేర్ చేయకుండా - తను చేస్తున్న కమ్యూనిటి సర్వీస్ గురించి హైలైట్ చేసుకుంటూ అందరినీ ఆకర్షిస్తుంది. అయితే మరోసారి తన ట్రేడ్ మార్క్ సెటైర్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది రష్మి.
తాజాగా ట్విట్టర్లో ఒక అభిమాని 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?' అని అడిగాడు. అందుకు రష్మీ స్పందిస్తూ .. "పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ అనే అర్థం. నా ప్రొఫెషన్ గురించి అడగండి చెబుతాను. అంతేగానీ నా పర్సనల్ విషయాలను మాత్రం అడగకండి. ప్రేమ .. పెళ్లి అనేవి నా వ్యక్తిగత విషయాలు. వాటిని గురించి ఎవరూ అడగడం నాకు ఇష్టం ఉండదు. అడిగినా చెప్పడం ఇష్టం ఉండదు. ఇకముందు కూడా ఎవరైనా సరే ప్రేమ .. పెళ్లి విషయాలను గురించి దయచేసి నన్ను అడగొద్దు" అని చెప్పుకొచ్చింది.
ఒక ప్రక్క లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వీధికుక్కలకు ఆహారం పెడుతోన్న రష్మి మూగజీవుల సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది. సాధ్యమైనంత వరకు చాలామంది ఈ విధంగా కమ్యూనిటీ సేవ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరుతోంది. ఇక ఈ గ్లామర్ బ్యూటీ అందాలకు క్రేజ్ బాగానే ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపేయడంతో రష్మిని ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారట. మళ్లీ అన్నీ షూటింగ్స్ మొదలైతే గాని రష్మీ అందాలను తిలకించే అవకాశం రాదు.. కాబోలు.