చలాకీగా ఉంటూ నవ్వించటమే కాదు.. తన అందాలతో వేడి పుట్టించటం.. కుర్రాళ్ల కలల రాణిగా మారి కవ్వించే ధోరణి యాంకర్ కమ్ నటి రష్మీలో ఎక్కువే. అందం పరంగా చూస్తే.. రష్మీకి పడే మార్కులు తక్కువే. అయితే.. ఆమె రియాక్ట్ అయ్యే తీరు ఆమెను అభిమానించేలా చేస్తుంది. అందాల ప్రదర్శనకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని ఈ ముద్దుగమ్మ పంచ్ లు వేయటమే కాదు.. తనపై పంచ్ ల్ని అంతే నేర్పుగా ఓకే చేయటంలో ఆమెలోని మంచిలక్షణంగా చెప్పాలి.
సీరియస్ ఇష్యూల మీద స్పందిస్తూనే.. కొన్ని ప్రశ్నల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం రష్మీకే చెల్లుతుంది. తాజాగా సోషల్ మీడియాలో తనను అభిమానించే వారితో జరిపిన ఆన్ లైన్ సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తన వ్యక్తిగత అభిరుచిని.. తన ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో చెప్పేలా తాజాగా ఆమె ఇచ్చిన సమాధానాలు ఉన్నాయని చెప్పకతప్పదు.
బాగా స్థిరపడ్డ వ్యాపారవేత్తా? బ్యాంక్ బ్యాలెన్స్ లేని మంచి ప్రియుడు? ఛాయిస్ ఏమిటో అన్న ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా బాగా స్థిరపడ్డ మంచి ప్రియుడ్ని ఎన్నుకుంటానని ప్సష్టం చేయటం గమనార్హం. మరి.. చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తా? బిజినెస్ మ్యానా? అంటూ నర్మగర్భంగా అడిగిన ప్రశ్నకు ఆ రెండూ కాదని తేల్చేసింది. మరి.. ఓ వ్యక్తిని కలిసినప్పుడు అతడిలో ఏం గమనిస్తారన్న ప్రశ్నకు చాలా తెలివిగా బదులిచ్చిన రష్మీ.. ఏది గమనించాలో అదే గమనిస్తానంటూ యూత్ కనెక్ట్ అయ్యే వ్యాఖ్య చేశారు.
గడిచిన కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వివాదంగా మారిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై స్సందించిన రష్మి.. సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఉందని చెప్పిన ఆమె.. మహిళలపై లైంగిక వేధింపులు ప్రతిచోటా జరుగుతున్నాయని.. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో చిత్ర పరిశ్రమను టార్గెట్ చేయటం ఆపాలన్నారు. ఛీప్ థ్రిల్ కోసం దీన్నో టాపిక్ గా మాట్లాడుకోవటం కంటే కూడా ఈ ఇష్యూను క్లోజ్ చేసేందుకు ఎవరెంత చేయాలో అంత చేస్తే బాగుంటుందన్న మంచి మాటను చెప్పింది. మరి.. ఇలాంటి మాటలకు శ్రీరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.