బోల్డ్ ఇమేజ్‌.. ర‌ష్మిగా గ‌ర్వంగా ఉంద‌ట‌

Update: 2016-02-27 17:47 GMT
బోల్డ్ గా న‌టించ‌డ‌మే కాదు.. బోల్డ్ గానే మాట్లాడేస్తోంది యాంక‌ర్ ట‌ర్న్డ్ హీరోయిన్ ర‌ష్మి గౌత‌మ్. త‌న కొత్త సినిమా గుంటూరు టాకీస్ లో ర‌ష్మి ఎలా రెచ్చిపోయిందో ప్రోమో సాంగ్స్ లోనే తెలిసిపోతోంది. మార్చి 4న రిలీజ‌వ‌బోతుఉన్న‌ ఈ సినిమాకు మంచి హైప్ రావ‌డానికి ర‌ష్మి హాట్ షోనే కార‌ణం అన‌డంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమాతో త‌న‌కొచ్చిన బోల్డ్ ఇమేజ్ వ‌ల్ల త‌న‌కేమీ ఇబ్బంది లేదని.. పైగా గ‌ర్వంగా ఉంద‌ని అంటోంది ర‌ష్మి.

‘‘అవును. గుంటూరు టాకీస్ లో నా పాత్ర‌ బోల్డ్ గా ఉంటుంది ఐతే నేను అలా నటించడానికి అభ్యంతరం చెప్పలేదు. నేను నా కెరీర్ మొదట్లో అన్ని రకాల పాత్రలు వేసినా నాకు గుర్తింపు రాలేదు. కానీ ఈ పాత్రలో నటించినందుకు నాకు ఇప్ప‌టికే ఓ పేరు వ‌చ్చింది.అందుకే బోల్డ్ ఇమేజ్ తెచ్చుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పింది ర‌ష్మి. బోల్డ్ సీన్స్ చేసేట‌పుడు త‌న‌కేమీ ఇబ్బందిగా కూడా అనిపించలేద‌ని ర‌ష్మి చెప్పింది. ‘‘ఆ బోల్డ్ సీన్స్ చివర్లో షూట్ చేశాం. నాకు సిద్ధూ గురించి బాగా తెలుసు. కాబట్టి అతడితో ఆ సీన్స్ చేయడానికి ఇబ్బంది పడలేదు’’ అని ర‌ష్మి అంది.

తాను హీరోయిన్ పాత్ర చేస్తే జ‌నాలు ఆద‌రిస్తార‌నే విష‌యంలో త‌న‌కేమీ సందేహాలేమీ లేవ‌ని ర‌ష్మి చెప్పింది.‘‘ఇప్పుడు ప్రేక్షకులు బాగా మారిపోయారు. ఉదాహరణకు అనసూయనే తీసుకోండి. తను ‘క్షణం’ లో చేసిన స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. కాబ‌ట్టి మన పని మనం బాగా చేస్తే అదే మనకి ఏదో ఒక రోజు గుర్తింపుని తీసుకువస్తుందని నా న‌మ్మ‌కం’’ అని చెప్పింది ర‌ష్మి.
Tags:    

Similar News