ఉన్నది ఉన్నన్నాళ్లు చూపిస్తే తప్పేంటో

Update: 2016-09-06 15:30 GMT
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. తనను హాట్ అనో.. సెక్సీ అనో అన్నందుకు ఏ మాత్రం ఫీల్ కానని గతంలో చెప్పేసింది. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో నుంచి మొదలుపెట్టి.. అమ్మడు తను ఫేమ్ అవడానికి సంధించిన అస్త్రం గ్లామర్. తన అందంతో తెచ్చుకున్న గుర్తింపును.. మరో మెట్టు ఎక్కిించడానికి కూడా గ్లామర్ నే ఉపయోగించుకుంటోంది.

గుంటూరు టాకీస్ తో మొదలుపెట్టి.. వరుసగా రష్మీ చేస్తున్న సినిమాలన్నీ ఓ లిమిట్ ని మించిన స్కిన్ షో ఆధారంగానే ఉంటున్నాయి. అన్నిటిలోనూ రష్మీ గౌతమ్ గ్లామర్ నే అడ్డు పెట్టుకుని మార్కెట్ చేసేసుకుంటున్నారు. అయితే.. తనలో అందం ఉన్నన్నాళ్లు దాన్ని చూపించడానికి ఏ మాత్రం సంకోచించనని అంటోందీ భామ. అయితే.. ఇక్కడ కొందరు తన స్కిన్ షోని మిస్ యూజ్ చేస్తున్నారనే విషయం కూడా అమ్మడికి బాగానే తెలుసని చెబుతోంది. అందన్ని ప్రదర్శించడానికి.. అసభ్యంగా కనిపించడానిక మధ్య ఓ చిన్న గీతే అడ్డు ఉంటుందని.. ఆ విషయం కూడా తెలియని కొందరు.. తన పోస్టర్లను మితిమీరి వాడేస్తున్నారని రష్మీ అంటోంది.

కేవలం గ్లామర్ తో. స్కిన్ షోతో మాత్రమే సినిమా ఆడేయదనే విషయంపై రష్మీ దగ్గర పక్కా క్లారిటీ ఉందిట. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే.. దానికి తన అందం మరింత బలం చేకూరుస్తుంది తప్ప.. కేవలం అమ్మాయిల అందాల కోసం ఏ సినిమాలు ఆడేయవని తేల్చేయడం విశేషం.
Tags:    

Similar News