రశ్మిక పెళ్లి చేసుకునేది ఎవరినంటే..

Update: 2018-07-09 10:14 GMT
తొలిచిత్రం ‘ఛలో’తోనే ఆకట్టుకుంది హీరోయిన్ రశ్మికా మందాన. అందం - అభినయంతో ఔరా అనిపించింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలున్నాయి. విజయ్ దేవరకొండతో ‘గీతాగోవిందం’ - డియర్ కామ్రేడ్ తోపాటు నానితో ‘దేవదాస్’ చిత్రంలో రశ్మికా నటిస్తోంది.  ప్రస్తుతం కన్నడ చిత్రం ‘వృత్ర’ షూటింగ్ లో భాగంగా బెంగళూరులో బిజీగా ఉంది.

అయితే తాజాగా రశ్మిక నిశ్చితార్థం ఫొటోలు లీక్ అయ్యి ఇండస్ట్రీ మొత్తం షాకైన సంగతి తెలిసిందే. వరుస సినిమాలు వస్తున్న క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఆమెకు కాబోయే వరుడు ఎవరనేది మాత్రం బయటకు రాలేదు..  

ఎట్టకేలకు రశ్మిక కు కాబోయే వరుడి పేరు బయటకు వచ్చింది. అతడి పేరు ‘రక్షిత్ శెట్టి’. కర్ణాటకకు చెందిన రక్షిత్ నటుడు మాత్రమే కాదు.. డైరెక్టర్ కూడా.. వీళ్లిద్దరూ 2016లో కన్నడలో కిరాక్ పార్టీ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా నుంచి వారి లవ్ జర్నీ కొనసాగుతోంది. నిశ్చితార్థం పూర్తయిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది.
Tags:    

Similar News