టాలీవుడ్ లో ఇప్పుడు మంచి రైజ్ లో ఉన్న కథానాయికలలో రష్మిక మందన్న ఒకరు. మహేష్ బాబు.. అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ల సినిమాలలో అవకాశాలు సాధించి అగ్ర హీరోయిన్ స్థానం దిశగా దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్' మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోంది. ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అయింది.
ఆ ఇంటర్వ్యూలో 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని మొదట తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలని అనుకున్నారని.. తర్వాత కన్నడ.. తమిళం.. మలయాళం భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారని తెలిపింది. ఈ టాపిక్ కంటిన్యూ చేసిన ఇంటర్వ్యూయర్ "మీకు కన్నడలో డబ్బింగ్ చెప్పడం ఈజీ అవుతుంది కదా?" అని ప్రశ్నించింది. "అది నాకు కష్టమే.. నేను కన్నడ సరిగా మాట్లాడలేను" అంటూ బదులిచ్చింది. ఈ కామెంట్ పై ఇప్పుడు కన్నడిగులు మండిపడుతున్నారు.
కన్నడ అమ్మాయి అయి ఉండి.. కర్ణాటకలో పుట్టి పెరిగిన రష్మిక మాతృభాషలో మాట్లాడడం కష్టం అని చెప్పడం ఏంటి? అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడడం కష్టం అని చెప్పడం ఫ్యాషన్ గా మారిందని.. ఇది కన్నడ భాషను అవమానించడమేనని కన్నడ భాషాభిమానులు మండిపడుతున్నారు. పలు కన్నడ సంఘాలు ఇప్పటికే రష్మిక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి రష్మిక ను నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ వాణిజ్య మండలికి రష్మికపై ఫిర్యాదు చేశారట. మరోవైపు రష్మికపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వివాదం ఎఫెక్ట్ 'డియర్ కామ్రేడ్' పై పడే అవకాశం ఉందని.. రిలీజ్ కు ఇబ్బందులు ఎదురు కావొచ్చని అంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన నిర్మాతలు అవసరమైతే రష్మిక చేత క్షమాపణలు చెప్పించి ఇష్యూ ను క్లోజ్ చేయాలని భావిస్తున్నారట.