క‌న్న‌డ ఇండ‌స్ర్టీతో లొల్లికి ర‌ష్మిక పుల్ స్టాప్ పెట్టేసిందిలా!

Update: 2022-12-09 04:47 GMT
క‌న్న‌డ ఇండ‌స్ర్టీ వ‌ర్సెస్ ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య నెల‌కొన్న వివాదం అమ్మ‌డిపై ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు దారి తీసిందో తెలిసిందే. టాలీవుడ్..బాలీవుడ్ లో బిజీ అవ్వ‌డం స‌హా కోట్ల రూపాయాలు పారితోషికం అందుకోవ‌డంతో బ్యూటీ మాతృభాష‌ని ప‌ట్టించుకో వ‌డం లేద‌ని..ఈ క్ర‌మంలోనే  మొద‌టి అవ‌కాశం క‌ల్పించిన నిర్మాణ సంస్థ పేరు చెప్ప‌డానికి కూడా ఆలోచించింద‌ని క‌న్న‌డ వ‌ర్గాలు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి.

ర‌ష్మిక‌ని ఇండస్ర్టీని బ్యాన్ చేయాల‌ని ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల క‌న్నెర్ర జెసారు. ఆమె ఏ భాష‌లో సినిమాలు చేసినా ఆ చిత్రాలు అన్నింటిని క‌న్న‌డ‌లో బ్యాన్ చేయాల‌ని సోష‌ల్ మీడియాలో వేదిక‌గా ఆగ్ర‌హ జ్వాల‌ల‌తో రిగిపోయారు. ఈ విష‌యాన్ని ఓ టాలీవుడ్ మేక‌ర్ వ‌ద్ద ప్ర‌స్తావిస్తే అలా చేస్తే క‌న్న‌డ ఇండ‌స్ర్టీనే  న‌ష్ట‌పోతుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు. తాజాగా ఈ వివాదం గురించి ర‌ష్మిక స్పందించింది.

ఈ విష‌యాన్నిఆమె దృష్టికి తీసుకెళ్తే ఇలా  అంది. 'కన్నడ ఇండ‌స్ర్టీ న‌న్ను బ్యాన్ చేయ‌లేదు.  నేను నా మాతృ ప‌రిశ్ర‌మ‌ని వ‌దిలేసి ఎక్క‌డికి వెళ్లిపోవ‌డం లేదు. నా వ్యక్తిగత జీవితంలో ఏమి జరుగుతుందో అది నాకు మరియు నాతో సంబంధం ఉన్నవారికి బాగా తెలుసు. కాంతారావు విడుదల సమయంలో.. కొంతమంది నాపై అనవసరంగా అతిగా స్పందించారు.

దాన్ని నేను సీరియస్‌గా తీసుకోలేదు.  ఆ సినిమా  విజయం సాధించినందుకు టీమ్ అంద‌రికీ  అభినందనలు తెలుపుతూ ఓ సందేశం  కూడా పంపించాను. ఆ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రికి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపాను.  నా అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి ఈ సందేశాలన్నింటినీ ప్రజలకు చూపించలేను. కన్నడ సినిమాల‌పై నాకు ఎప్ప‌టికీ గౌర‌వం..కృత‌జ్ఞ‌తా భావం ఉంటుంది.

సరైన ఆఫర్ వస్తే కన్నడ సినిమాల్లో నటించేందుకు కూడా  సిద్దంగానే ఉన్నాను. అక్క‌డ సినిమాలు చేయ‌లేద‌ని వ్య‌క్తిగ‌త ఊహ‌ల్లోకి వెళ్లోద్దు' అని కోరుకుంది.  తాజాగా వ్యాఖ్య‌ల‌తో ఈ వివాదానికి ఇక్క‌డితో పుల్ స్టాప్ ప‌డే అవ‌కాశం ఉంది. ఆమెపై వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేసిన వారు కూల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ర‌ష్మిక పుష్ప‌-2 సినిమాతో పాటు బాలీవుడ్ లో యానిమ‌ల్ షూటింగ్ లో బిజీగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News