'ఫేం' ఉన్నంత కాలమే సంపాదన. ఈ వ్యవధిలోనే ఆస్తులు కూడబెట్టాలి. వాటితో వ్యాపారాలు మొదలుపెట్టాలి. అటుపై మంచి బిజినెస్ మెన్ నో..వెల్ సెటిల్డ్ పర్సన్ నో పెళ్లి చేసుకుని స్థిరపడిపోవాలి. ఇది హీరోయిన్ల లెక్క. ఈ ఆర్డర్ లో ఎక్కడా మార్పులొచ్చినా లైఫ్ ఆర్డర్ మారిపోతుంది. ఇలా తెలివిగా లైఫ్ ని ప్లాన్ చేసుకుని సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న వారు కొందరైతే ఆర్డర్ చేంజ్ అవ్వడంతో అదోగతి పాలైన వాళ్లు లేకపోలేదు.
ప్రస్తుతం రష్మిక మందన్న సక్సెస్ ఫుల్ హీరోయిన్లనే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతోంది. టాలీవుడ్ లో కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన రష్మిక అటుపై ఎదిగిన వైనం గురించి తెలిసిందే. 'ఛలో' సినిమాతో ప్రారంభమైన అమ్మడు నేడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. భారీ పారితోషికం అందుకుంటుంది. ఇదే మాదిరి బాలీవుడ్ లో కూడా వెలిగిపోవాలని తహతహలాడుతోంది.
అమ్మడి ఫ్యాషన్‌ని గుర్తించి మేకర్స్ ఆ రకంగా అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా టాలీవుడ్ ..బాలీవుడ్ రెండు చోట్ల ఆదాయం బాగానే సమకూరుతోంది. అందుకే రష్మిక ఇప్పుడు వ్యాపారం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తాజాగా రష్మిక వేగన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ సంస్థకి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు సదరు సంస్థ ప్రకటించడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఇక్కడ అమ్మడు తన స్టార్ డమ్ నే పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా..వచ్చే ఆడబ్బునే పెట్టుబడిగా అదే సంస్థలో పెట్టి భాగస్వామిగా శాతాన్ని అందుకుంటుంది. అంటే హీరోలు పారితోషికం తీసుకోకుండా సినిమా సాధించిన వసూళ్లలో కొంత శాతం తీసుకునే లెక్కలో అన్న మాట.
ఇప్పటికే రష్మిక కొన్ని సంస్థల్ని ఎండార్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఎలాంటి భాగస్వామ్యం కోరలేదు. కేవలం పారితోషికం ప్రాతిపదికనే ఎండార్స్ చేస్తోంది. అయితే వేగాన్ బ్యూటీ ప్రొడక్స్ట్ కి మాత్రం పార్టనర్ గా మారినట్లు తెలుస్తోంది. ఇలాంటి బిజినెస్ స్ర్టాటజనీ ఇప్పటికే కొంత మంది హీరోయిన్లు అనుసరిస్తున్నారు. వాళ్ల బాటలోనే రష్మిక కూడా కొత్త ప్రయాణం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
రష్మిక బాలీవుడ్ లో ఇప్పుడే ప్రయాణం మొదలు పెట్టింది. అక్కడా సక్సెస్ అయితే నటిగా మరింత ఫేమస్ అవుతుంది. పుష్ప విజయంతో పాన్ ఇండియా లో గుర్తింపు దక్కింది. అదే ఐడెంటీటితో ఉత్తరాదిన వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ లో నూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'పుష్ప ది రూల్' షూట్ కి రెడీ అవుతోంది.