అందాల కథానాయికలు గుండుతో ప్రయోగాలు చేయడం అరుదుగా చూస్తుంటాం. ఇంతకుముందు ఓ సినిమా కోసం కథానాయిక పూర్ణ గుండుతో కనిపించారు. అనుష్క శర్మ- ప్రియాంక చోప్రా- టబు- షబానా ఆజ్మి లాంటి నటీమణులు ఇంతకుముందు గుండుతో ప్రయోగాలు చేశారు. కెరీర్ లో విలక్షణ పాత్రల ఎంపికలో అది కూడా భాగం.
అయితే క్యారెక్టర్ కోసం గుండు చేయించుకోవడం వేరు.. యాప్ లలో సాంకేతికత మాయతో గుండు కొట్టించడం వేరు. ఇంతకుముందు నయనతార- సమంత- సాయి పల్లవి- కీర్తి సురేష్ - షాలినీ పాండే వంటి నాయికల గుండు ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అవి ఒరిజినాలిటీకి ఏమాత్రం తగ్గకుండా కనిపించడంతో రియల్ గానే అలా చేశారా? అంటూ అభిమానులు ఆరాలు తీసారు. మెజారిటీ కథానాయికల గుండు ఫోటోలు గూగుల్లో అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు సేమ్ టు సేమ్ రష్మిక మందన గుండు ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా యాప్ లు టెక్నాలజీ మహిమ. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అందుకే ట్రోలర్స్ కూడా పెరుగుతున్నారు. రష్మిక డైహార్డ్ ఫ్యాన్స్ ఇది తట్టుకోలేక ఇలా చేసిన వారిని తిట్టేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం తెలుగు లో రెండు సినిమాలు హిందీలో రెండు సినిమాలతో బిజీగా ఉంటే ఇప్పటికిప్పుడు గుండు కొట్టించుకుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు తన పాత్ర కోసం జ్యోతిర్మయి అనే మళయాల నటి గుండు కొట్టించుకుని సోషల్ మీడియాల్లో ప్రత్యక్షమయ్యారు. దాదాపు 30 పైగా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ నిజంగానే గుండు కొట్టించుకున్నా ఇది కూడా యాప్ - మార్ఫింగ్ మాయాజాలం అని పొరబడుతున్నారు. ఇదంతా టెక్నాలజీ మహిమ.. వెకిలి విద్యల ఫలితం అనుకోవాలి.