తన సినిమాల రిలీజ్ లకు ముందు రిలీజ్ తర్వాత విదేశీ వెకేషన్లతో రిలాక్స్ అవ్వడం మహేష్ కి అలవాటు. మహేష్ తన పిల్లలు కుటుంబంతో కలిసి సెలబ్రేషన్ మోడ్ లో ఉంటారు. ఇప్పుడు అతడి లానే విదేశీ వెకేషన్లతో సెలవులను ఎంజాయ్ చేయడాన్ని అలవాటు చేసుకుంది రష్మిక మందన.
ఇటీవల ఈ బ్యూటీ తరచుగా విదేశీ వెకేషన్లకు వెళుతోంది. ముఖ్యంగా వరుస సినిమా షెడ్యూళ్లతో తీవ్రంగా అలసిపోతున్నందున రిలాక్స్ అయ్యేందుకు రిజనవేషన్ కోసం విదేశీ సముద్ర తీరాలను విలాసవంతమైన జీవన విధానాన్ని ఎంపిక చేసుకుంటోంది.
రష్మిక నటించిన తాజా చిత్రం 'మిషన్ మజ్ను' విడుదలకు ముందు విశ్రాంతి తీసుకోవాలన్న తన కోరికను బహిర్గతం చేసింది. కొద్దిరోజుల పాటు విహారయాత్రకు వెళ్లాలనుకుంటోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది. తనను హాలీడే బగ్ (పురుగు) కరిచిందని సెలవులను ఆస్వాధించాలనుకుంటున్నానని ఇన్ స్టా పోస్ట్ లో తెలిపింది. అంతేకాదు.. ఇటీవలి హాలిడే ట్రిప్ నుండి ఒక ఫోటోని కూడా రష్మిక షేర్ చేసింది. ఈ ఫోటోలో కుర్తా -ప్రింటెడ్ పలాజో ధరించి సుందరమైన లొకేషన్ ని ఆస్వాధిస్తూ రిలాక్స్ డ్ గా కనిపిస్తోంది. బ్లాక్ సన్ గ్లాసెస్ తో స్టైలిష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఇంతలోనే 'మిషన్ మజ్ను' గురించి రష్మిక సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఇందులో తన పాత్ర నస్రీన్ గురించి అద్భుతంగా వర్ణించింది. ''షరతులు లేని ప్రేమ.. అమాయకత్వం .. వామ్ నెస్ ని ప్రదర్శించే పాత్ర ఇది. తన ప్రియమైన వ్యక్తికి ఎల్లప్పుడూ బేషరతుగా మద్దతు ఇస్తుంది. ఆమె నొప్పిని నిస్సహాయతను బాధలను నిశ్శబ్దంగా భరించి..తన ప్రేమను దక్కించుకోగలుగుతుంది. ఎవరు ఏం చేసినా- ఆమె అత్యంత ఇష్టపడే వ్యక్తిలో చిరునవ్వును తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. తాను పరిపూర్ణంగా కాదని తనకు తెలుసు.. కానీ ఆమె చేయగలిగిన ప్రతిదానిలో ఆనందాన్ని ఓదార్పును పొందుతుంది..'' అంటూ తన పాత్ర గురించి వర్ణించింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా యుద్ధ వీరుడిగా నటించాడు. అతడి ప్రేయసిగా రష్మిక నటించింది.
ఇండియా- పాకిస్తాన్ వార్ నేపథ్యంలో నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం మిషన్ మజ్ను. షేర్షా తరహాలోనే దేశభక్తి జానర్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో రష్మిక పాత్ర అభిమానులను సర్ ప్రైజ్ చేయనుందని... ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో రొమాంటిక్ యాంగిల్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని టాక్ వినిపించింది. మిషన్ మజ్ను ఈనెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.