ఒక భాషలో హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా పేరు డిమాండ్ తెచ్చుకుంటే చాలు వాళ్ళు నటించిన ఇతర బాషా సినిమాలను డబ్బింగ్ రూపంలో తీసుకొచ్చి క్యాష్ చేసుకునే ప్రయత్నాలు టాలీవుడ్ లో సర్వసాధారణం. విక్రం-సూర్య-విజయ్ అంటోనీ-ధనుష్ వీళ్ళవి అలా ఎన్ని వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. అయితే ఈసారి హీరోకు కాకుండా అలాంటి అటెంప్ట్ హీరొయిన్ కు చేశారు. తనే రష్మిక మందన్న.
ఛలోతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గీత గోవిందం రూపంలో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్ల సరసన నటించె రేంజ్ కు చేరుకుంది. ఈ నేపధ్యంలో తన ఇమేజ్ ని వాడుకుంటూ గీత ఛలో అనే మూవీ వస్తోంది. రెండు హిట్ టైటిల్స్ లో సగం ఒకటి పూర్తిగా ఒకటి తీసుకుని నిర్మాతలు తమ ఉద్దేశాన్ని చెప్పేశారు
అలా అని ఇది మరీ కొత్త సినిమా కాదు. 2017లో వచ్చిన కన్నడ మూవీ చమక్ కు డబ్బింగ్ వెర్షన్. గణేష్ హీరోగా నటించిన ఈ మూవీ ఆ టైంలో పెద్ద హిట్ గా నిలిచింది. ఇందులో రష్మిక మందన్న ఎంబిఎ చదివి ఈవెంట్ మేనేజ్ మెంట్ చేస్తూ డాక్టర్ అయిన హీరోను పెళ్లి చేసుకునే పాత్ర చేసింది. పెళ్లి చేసుకున్నాక లైఫ్ పార్ట్నర్ తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఉన్నారని భావించి విడాకుల దాకా వెళ్ళే ఓ జంట కథ ఇది. ఎలాగూ ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తోంది కాబట్టి వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. జుదా శాండీ సంగీతం అందించిన ఈ మూవీకి సుని దర్శకుడు.