సంక్రాంతి పండక్కి విడుదలైన మహేశ్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందాడ మేనరిజమ్ బాగా పాపులర్ కావటం తెలిసిందే. మీకు అర్థమవుతుందా? అంటూ వివిధ సందర్భాల్లో రష్మిక నోటి నుంచి వచ్చిన ఈ మాట.. ప్రేక్షకుల్ని గిలిగింతలకు గురి చేస్తుంది. సూపర్ హిట్ అయిన ఈ రీల్ డైలాగ్ ను రియల్ లైఫ్ లోనూ ఆమె ఇంత త్వరగా చెప్పాల్సి వస్తుందని రష్మిక కూడా ఊహించి ఉండదేమో.
ఓపక్క సరిలేరు నీకెవ్వరు చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా దూసుకెళుతున్న వేళ.. రష్మికకు అనుకోని విధంగా షాకింగ్ వార్త ఎదురైంది. కర్ణాటకలోని ఆమె నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని.. ఆమెను విచారణకు రావాలని ఆదేశించారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వరుస సక్సెస్ లతో దూసుకెళుతున్న రష్మికకు ఇవాల్టి రోజున బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి. వరుస చిత్రాల్లో బిజీగా ఉన్న ఆమె.. తనపై జరుగుతున్న రెండు ప్రచారాల విషయంలో ఒకింత వేదనతో ఉన్నట్లు చెబుతున్నారు.
తాను ఐటీశాఖకు కట్టాల్సిన పన్నులు క్రమం తప్పకుండా కడుతున్నానని.. తాజాగా జరిగిన ఐటీ సోదాలు తన తండ్రి చేసే వ్యాపారానికి సంబంధించినవే తప్పించి.. తనకు సంబంధం లేదంటున్నారు. అంతేకాదు.. తన ఐటీ లెక్కలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని ఆమె వివరణ ఇస్తున్నారు. అంతేకాదు.. ఐటీ సోదాల వేళ.. తన మీద వచ్చిన చాలా వార్తల్లో నిజం లేదంటున్న ఆమె.. విచారణకు ఐటీ శాఖ తనను పిలవలేదని.. తన తండ్రిని పిలిచినట్లుగా ఆమె మేనేజర్ వివరణ ఇవ్వటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దూసుకెళుతున్న రష్మిక తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపైనా ఆమె ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. తాను పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సాగుతున్న ప్రచారం పూర్తి అసత్యమని క్లారిటీ ఇవ్వటమే కాదు.. తాను భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే స్థాయికి ఇంకా ఎదగలేదని ఒద్దికతో మాట్లాడుతుంది. తాను చెప్పాల్సిందంతా చెబుతూ.. మీకు అర్థమవుతుందా? అన్నట్లుగా రష్మిక మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.