చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న 61వ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాకి సంబంధించి టెస్ట్ షూట్ జరుగుతుంది. ఇందులో విక్రమ్ కి జోడీగా రష్మిక మందన్నని ఎంపిక చేసారు. అమ్మడి పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ లాక్ చేసారు. అంతకు ముందు పలువురు భామల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ హీరోయిన్ పాత్రకి రష్మిక అయితేనే న్యాయం చేగలదని భావించి ఏరికోరి మరీ తీసుకున్నారు.
అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా రష్మిక తప్పుకుంది. ముందు అనుకున్న విధంగా కాల్షీట్లు సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో ఆఫర్ ని వదులోకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో పారంజిత్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పుష్ప-2 షూటింగ్ సహా బాలవుడ్ లో కొన్ని సినిమాలతో బిజీగా ఉండటంతో కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో తప్పుకున్నట్లు తెలుస్తుంది.
అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తాన్ని కూడా రష్మిక తిరిగి చెల్లించిందిట. ఈ నేపథ్యంలో రష్మిక స్థానంలో మాళవిక మోహనన్ ని తీసుకున్నట్లు సమాచారం. అమ్మడికిది తమిళ్ లో నాల్గవ చిత్రం. విక్రమ్ తో తొలిసారి కలిసి నటించే ఛాన్స్ రావడంతో మాళవిక ఆనందానికి అవధుల్లేవ్. తన అభిమాన హీరోల్లో విక్రమ్ ఒకరు. అలాంటి స్టార్ తో కెరీర్ ఆరంభంలోనే నటించే అవకాశం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి కడపలో మొదలైంది. తమిళ్ తో పాటు హిందీలో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఇతర అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా కేటగిరీలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ ఇటీవలే పొన్నియన్ సెల్వన్ మొదటి భాగంతో భారీ సక్సెస్ అందుకుని రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు.
అంతకు ముందు నటించిన కొన్ని సినిమాలు వరుసగా అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈనేపత్యంలో సక్సస్ కీలకంగా మారిన తరుణంలో మణిరత్నం రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో పడింది. అలాగే పారంజిత్ కి కొంత కాలంగా సరైన విజయం లేదు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లు తెరకెక్కిస్తున్నా అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విక్రమ్ 61 ని ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. తన మార్క్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.