ట్రోలింగ్ కల్చర్ అంతకంతకు విస్తరిస్తోందే కానీ తగ్గడం లేదు. ముఖ్యంగా కథానాయికలపై హేట్ మెసేజ్ లు దూషణలు ఆగకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఇంతకుముందే తనని సామాజిక మాధ్యమాల్లో ద్వేషించేవారిని ఉద్ధేశించి మాట్లాడుతూ ఇలాంటి విష సంస్కృతి అంత మంచిది కాదని వాపోయారు. తనను కొందరు మంత్రగత్తె అని కూడా ట్రోల్ చేశారని కానీ నేను వేటినీ పట్టించుకునే స్థితిలో లేనని కూడా శ్రుతిహాసన్ అన్నారు.
ఇప్పుడు రష్మిక మందన్న ట్రోలింగ్ కల్చర్ పై తన ఆవేదనను వ్యక్తం చేశారు. ట్రోలర్లపై ఒక లాంగ్ నోట్ రాసారు. ఓవైపు టాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన రష్మిక నేషనల్ క్రష్ గా బోలెడంత పాపులరైంది. కానీ ఇటీవల గుడ్ బై చిత్రంతో ఫ్లాప్ ని ఎదుర్కొంది. అనంతరం తనపై ట్రోలింగ్ అమాంతం పెరిగింది. దీంతో కలత చెందిన రష్మిక సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్ధేశించి ఒక సుదీర్ఘ నోట్ ను రాసింది. ఇంటర్నెట్ లో ద్వేషాన్ని ఎదుర్కోవడం 'హృదయ విదారకం'.. ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని కోట్ చేసింది రష్మిక. ఇంటర్నెట్ లో తప్పుడు కథనాలు వ్యాప్తి చెందుతున్నాయని ఇది తనకు పరిశ్రమలో అలాగే పరిశ్రమేతర సంబంధాలకు చాలా హానికరం అని ఎత్తి చూపారు.
ఇన్ స్టాగ్రామ్ లో రష్మిక ఇలా పేర్కొంది. ''గత కొన్ని రోజులు లేదా వారాలు నెలలు లేదా ఏళ్లుగా నన్ను కొన్ని విషయాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. నేను దానిని పరిష్కరించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. నా కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సంవత్సరాల క్రితం చేయవలసిన పని ఇది. నేను నా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి నేను చాలా ద్వేషానికి గురవుతున్నాను. చాలా ట్రోలింగ్ ప్రతికూలతను ఎదుర్కొన్నాను. అలాంటి వాటికి నా సమాధానం ఇదే. నేను ఎంచుకున్న జీవితం రిస్క్ తో కూడుకున్నదని నాకు తెలుసు. నేను మీ అందరికి కప్పు టీని కాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రేమను పొందుతారని నేను అనుకోను. మీరు నన్ను ఆమోదించనందున ప్రతికూలతను వెదజల్లవచ్చు అని దీని అర్థం కాదు'' అని రాసింది.
తన అభిమానులను సంతోషపెట్టడానికి మాట్లాడుతూ.. ఈరోజు లేదా అనునిత్యం చేసే పని ఏంటో నాకు మాత్రమే తెలుసు. నా పనితో మీరు సంతోషించడం అవసరం. దానినే ఎక్కువగా పట్టించుకుంటాను. మీరు గర్వించేలా నిరూపించడానికి నిజంగా నా శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాను''అని చెప్పింది.
రష్మిక ఇంకా తన మనసును ఆవిష్కరిస్తూ....''ఇంటర్నెట్ ద్వారా నన్ను ఎగతాళి చేయడం హృదయ విదారకం.. అది నన్ను చాలా నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో నేను చెప్పని వాటి కోసం ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాను. నేను చెప్పిన కొన్ని విషయాలు నాకు వ్యతిరేకంగా మారుతున్నాయని గుర్తించాను. పరిశ్రమలో లేదా వెలుపల నాకు ఉన్న సంబంధాలకు చాలా హాని కలిగించే తప్పుడు కథనాలు ఇంటర్నెట్ లో వ్యాప్తి చెందుతున్నాయి'' అని ఆవేదన చెందారు.
నేను అన్నివేళలా నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే అది నన్ను మెరుగుపరచడానికి మెరుగ్గా పనిచేయడానికి మాత్రమే పురికొల్పుతుంది. కానీ నీచమైన ప్రతికూలత ద్వేషం దేనికి? చాలా కాలంగా దానిని విస్మరించమని చాలామంది చెబుతూనే ఉన్నారు. కానీ అది మరింత దిగజారింది. దాన్ని పరిష్కరించడం ద్వారా నేను ఎవరినీ గెలవడానికి ప్రయత్నించడం లేదు. నేను ఎదుర్కొంటున్న ఈ ద్వేషం కారణంగా నేను కొందరితో సన్నిహితంగా ఉండకూడదనుకుంటున్నాను. నేను ఒక సాధారణ మనిషినే..'' అని అంది. తన అభిమానులను గౌరవించి నిరంతర మద్దతుగా నిలిచేవారి ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది.
ఒక రకంగా నేను మీలో కొందరి నుండి పొందుతున్న ప్రేమను గుర్తించాను. దానిని అంగీకరిస్తున్నాను. మీ నిరంతర ప్రేమ మద్దతు నన్ను ముందుకు నడిపించింది. బయటకు వచ్చి ఇలా చెప్పడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపైనా నాకు ప్రేమ ఉంది. నేను ఇప్పటివరకు పనిచేసిన వ్యక్తులు.. నేను ఎప్పుడూ మెచ్చుకునే వారందరిపైనా నా ప్రేమ తగ్గదు. నేను మీ కోసం కష్టపడి పని చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను చెప్పినట్లు మిమ్మల్ని సంతోషపెట్టడం నాకు సంతోషాన్నిస్తుంది. అందరూ దయతో ఉండండి. మేమంతా మా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ధన్యవాదాలు'' అని నోట్ ని ముగించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రష్మిక ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను రిలీజ్ కావాల్సి ఉంది. రష్మిక తదుపరి తమిళంలో విజయ్ సరసన 'వరిసు'లో... హిందీలో రణబీర్ కపూర్ సరసన 'యానిమల్'లో నటిస్తోంది. దక్షిణాదిన అంజనీ పుత్ర (2017)- గీత గోవిందం (2018)- యజమాన (2019)- సరిలేరు నీకెవ్వరు (2020)- భీష్మ (2020)- పొగరు (2021) - పుష్ప వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో 35 మిలియన్లకు పైగా అభిమానుల ఫాలోయింగ్ ను కలిగి ఉంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ రణ్ వీర్ సింగ్.. విక్కీ కౌశల్ అలియా భట్ తనను అనుసరించేవారిలో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.